Flax Seeds Benefits: ఆధునిక బిజీ లైఫ్ కారణంగా వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి, కాలుష్యం ఇలా వివిధ కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. హెయిర్ ఫాల్, హెయిర్ వైటెనింగ్ ఇందులో అతి ముఖ్యమైన సమస్యలు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం కేశాలకు సంబంధించిన సమస్య చాలా పెరిగిపోయింది. జుట్టు రాలిపోవడం, నిర్జీవంగా మారడం, తెల్ల జుట్టు వంటి సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. టీనేజ్ వయస్సులోనే ఈ సమస్య ఎదురుకావడం వల్ల నలుగురిలో అసౌకర్యానికి లోనవుతుంటారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు మార్కెట్‌లో లభించే చాలా రకాల ఉత్పత్తుల్ని వాడుతున్నా..ఫలితం ఉండదు. అందుకే జుట్టు తెల్లబడినప్పుడు సహజసిద్ధంగా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫ్లక్స్ సీడ్స్ అద్భుతమైన ప్రత్యామ్నాయంగా కన్పిస్తున్నాయి. ఇందులో ఎసెన్షియల్ మైక్రో, మైక్రో న్యూట్రియంట్లు ఉంటాయి.. దాంతోపాటు ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఫ్లక్స్ సీడ్స్ సహాయంతో జుట్టుని సహజసిద్ధంగా నల్లబడేట్టు చేయవచ్చు.


ఫ్లక్స్ సీడ్స్ అనేవి కేశాలకు చాలా ప్రయోజనకరం. వీటిని సేవిస్తే మార్కెట్‌లో లభించే ఏ ఉత్పత్తుల్ని కూడా వాడాల్సిన అవసరం ఉండదు. ఫ్లక్స్ సీడ్స్‌తో హెయిర్ జెల్ తయారు చేసుకుని రోజూ వాడితే అద్భుతమైన ప్రయోజననాలుంటాయి. దీనికోసం 1 కప్పు ఫ్లక్స్ సీడ్స్ విత్తనాలు, 3-4 కప్పుల నీళ్లు, 3-4 డ్రాఫ్స్ ఎసెన్షియల్ ఆయిల్, 1 చెంచా జైతూన్ లేదా కొబ్బరి నూనె లేదా విటమిన్ ఇ ఆయిల్ అవసరమౌతాయి. 


ఫ్లక్స్ సీడ్స్‌ను నీళ్లలో వేసి బాగా ఉడకబెట్టాలి. ఆ తరువాత స్టౌ నుంచి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని ఏదైనా మెత్తని వస్త్రంలో వేయాలి. బాగా శుభ్రం చేసి గాజు కంటైనర్‌లో వడపోయాలి. ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో 1-2 చెంచాల జెల్ వేయాలి. ఆ తరువాత ఇందులో ఆలివ్, విటమిన్ ఇ లేదా కొబ్బరి నూనె కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. ఈ జెల్‌ను 10-15 రోజుల వరకూ ఫ్రిజ్‌లో స్టోర్ చేయవచ్చు. ఇందులో ఎసెన్షియల్ ఆయిల్ కలపడం వల్ల 20-25 రోజుల వరకూ స్టోర్ చేయవచ్చు.


ఫ్లక్స్ సీడ్స్ హెయిల్ జెల్ వాడటం వల్ల కేశాలు ఆరోగ్యంగా ఉండేందుకు వీలుగా స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జెల్ కేశాల్లోని రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. కేశాల ఎదుగుదలలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. తెల్ల జుట్టు సమస్య సులభంగా దూరం చేస్తుంది. కేశాల్ని దట్టంగా, పటిష్టంగా మారేందుకు దోహదపడతాయి.


Also read: Cumin Seeds Benefits: ఈ నీళ్లు రోజూ పరగడుపున తాగితే చాలు..స్థూలకాయం సహా చాలా సమస్యలు దూరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook