భారతదేశపు ఆహారపు అలవాట్లు, రుచి మిగిలిన దేశాలతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటాయి. అదే సమయంలో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం కూడా. ఇందులో కిచిడీ ఒకటి. అత్యంత పోషక విలువలున్న ఆహారం ఇది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా మంది ఇళ్లలో కిచిడీ చేస్తుంటారు. కిచిడీ రుచి ఒక్కటే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం. కిచిడీ సహజసిద్ధమైన గ్లూటేన్ ఫ్రీ ఆహారం. ఇది తినడం వల్ల సీలియెక్ వ్యాధి, గ్లూటేన్ సెన్సిటివిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకే ఆరోగ్యంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలంటే కిచిడీ తప్పకుండా తీసుకోవాలి. కిచిడీ తినడం వల్ల ఆరోగ్యపరంగా ఏయే ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.


రోజూ కిచిడీ తినడం వల్ల కలిగే లాభాలు


డయాబెటిస్ రోగులకు


డయాబెటిస్ సమస్యకు సగ్గుబియ్యంతో చేసే కిచిడీ చాలా మంచిది. తడి సగ్గుబియ్యం కిచిడీ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెగ్యులేషన్ క్రమంగా ఉంటుంది. హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ముప్పు తగ్గుతుంది. మీరు ఒకవేళ డయాబెటిస్ రోగి అయితే..కిచిడీ తినడం చాలా మంచిది.


అధిక బరువుకు చెక్


కిచిడీలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా చాలా సులభంగా జీర్ణమౌతుంది. కిచిడీ తిన్నప్పుడు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్టుంటుంది. తిండి యావ తగ్గిస్తుంది. ఈ క్రమంలో మీరు బరువు తగ్గించుకోవాలని ఆలోచిస్తుంటే..కిచిడీ తినడం మంచిది.


శక్తివంతమైన న్యూట్రిషన్


కిచిడీ ఒక పౌష్ఠిక ఆహారం. ఇందులో ఉండే పోషక పదార్ధాలు శరీరాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. అందుకే కిచిడీ ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది.


శరీరాన్ని డీటాక్స్ చేయడం


కిచిడీ శరీరాన్ని శుభ్రం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. కిచిడీని డీటాక్సిఫికేషన్ ప్రక్రియలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. రోజూ డైట్‌లో భాగంగా చేసుకోవడం వల్ల చాలా లాబాలున్నాయి.


Also read: Weight Loss Tips: ఎంతటి బరువైనా సరే ఇలా 15 రోజుల్లో దిగి రావడం ఖాయం..



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook