Lemon Tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో నిమ్మకాయ అత్యంత కీలకమైందిగా పరిగణించాలి. విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మకాయతో కలిగే ప్రయోజనాలు లెక్కకు మించి ఉంటాయి. రోజూ నిమ్మకాయ సేవిస్తే రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అయితే నిమ్మకాయను కొన్ని పదార్ధాలతో కలిపి సేవించకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి నిమ్మరసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా రకాల వ్యాధులు దరిచేరవు. కొన్ని అధ్యయనాల ప్రకారం నిమ్మకాయ రోజూ సేవించేవారి జీవితకాలం నిమ్మకాయ అస్సలు తినని వారి కంటే 3 వారాలు ఎక్కువేనట. ఆరోగ్యపరంగా నిమ్మ అంత అద్భుతమైంది. 


సాధారణంగా పన్నీర్ తయారు చేసేటప్పుడు మరిగే పాలలో నిమ్మరసం పిండుతారు. కానీ ఇందులో ఉండే యాడిస్ ప్రోటీన్లను దెబ్బతీస్తుంది. ఫలితంగా యాసిడ్ రిఫ్లెక్షన్ ఏర్పడి గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకే పన్నీర్‌లో నిమ్మరసం కలపడం మంచిది కాదు. చాలామంది సలాడ్‌లో ఎక్కువగా నిమ్మరసం ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని రకాల పండ్లతో నిమ్మరసం రియాక్షన్ ఇస్తుంది. ముఖ్యంగా బొప్పాయి, నారింజ, ద్రాక్ష, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లతో కలిపితే నష్టం వాటిల్లుతుంది. యాసిడ్ రిఫ్లెక్షన్, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడవచ్చు.


చాలామంది ముఖ్యంగా మందు బాబులు కాక్టెయిల్స్, బీర్లతో నిమ్మకాయను ఉపయోగిస్తారు. కానీ నిమ్మ, రెడ్ వైన్ కాంబినేషన్ ఏ మాత్రం మంచిది కాదు. నిమ్మలోని ఎసిడిటీ రెడ్ వైన్‌లోని టానిన్‌లను ప్రభావం చేయడం వల్ల వైన్ చెదెక్కుతుంది. మరీ ముఖ్యంగా నిమ్మకాయ ఉపయోగం ఎక్కువగా భారతీయుల్లోనే ఉంటుంది. ప్రతి వంటలోనూ తప్పకుండా వినియోగిస్తుంటారు. నిమ్మలో ఉండే ఎసిడిటీ స్వభావం వల్ల స్పైసీ ఫుడ్స్‌తో కలిపి తిన్నప్పుడు శరీరంలో వేడి పెరగడమే కాకుండా జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. అందుకే స్పైసీ ఫుడ్స్‌లో నిమ్మ వినియోగం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 


వేడి వేడి ఆహారంలో నిమ్మరసం అస్సలు కలపకూడదంటారు. ఎందుకంటే వేడి ఆహారంలో కలపడం వల్ల నిమ్మలోని విటమిన్ సి దూరమౌతుంది. అంటే స్టీమ్డ్ ఫుడ్‌లో అస్సలు ఉపయోగించకూడదు.


Also read: Hair Blackening Tips: రోజూ డైట్‌లో ఈ పదార్ధాలుంటే చాలు, రంగు వేయకుండా జుట్టు నల్లబడుతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook