Summer Effect: ఈ వేసవి పీక్స్‌కు చేరింది. రోహిణి కార్తె రాకుండానే రోళ్లు పగిలే ఎండలు దంచి కొడుతున్నాయి. రేపట్నించి రోహిణి కార్తె ప్రారంభం కానుండటంతో ఇంకెలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమౌతోంది. పూర్తి వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Summer Effect: ఈ ఏడాది ఎండల తీవ్రత ముందుగా హెచ్చరించినట్టుగానే చాలా తీవ్రంగా ఉంది. ఎండల తీవ్రత, వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న వారం రోజులు ఎండల తీవ్రత మరింతగా పెరగవచ్చని అంచనా. దీనికి కారణం రోహిణి కార్తె. అసలీ రోహిణీ కార్తెకు ఎండలకు సంబంధమేంటి


ప్రతి యేటా వేసవిలో రోహిణి కార్తె గురించి తప్పకుండా చర్చకొస్తుంటుంది. ఎండాకాలంలో రోహిణి కార్తె అంటే భయపడిపోతుంటారు. ప్రస్తుతంద్ది ఎండలు గట్టిగా దంచికొడుతున్నాయి. సాధారణంగా రోహిణి కార్తె నుంచి ఎండలు పీక్స్‌కు చేరుతాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుంటాయి. అలాంటిది రోహిణి కార్తె రాష్ట్రంలో ఇంకా ప్రారంభమే కాలేదు. రేపట్నించి అంటే మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. రేపట్నించి ప్రారంభమై జూన్  8 వరకూ ఉంటుంది. ఈ సమయంలో తీవ్రమైన ఎండలు, వడగాల్పులు దంచి కొడుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా 42-43 డిగ్రీల వరకూ నమోదవుతోంది. 


మొన్నటి వరకూ బెంబేలెత్తించిన ఎండలు కొద్దిరోజుల్నించి తీవ్రత తగ్గాయి. పదిరోజుల క్రితమైతే రాష్ట్రమంతా ఒక్కసారిగా భగ్గుమంది. రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో అత్యధికంగా 46-49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వరుసగా ముడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి. రాజమండ్రిలో అత్యధికగా 48-49 డిగ్రీలు రెండ్రోజుల పాటు నమోదైతే..విజయవాడలో వరుసగా రెండ్రోజులు 47-48 డిగ్రీలు నమోదైంది. అప్పట్లోనే రోహిణి కార్తె వచ్చిందా అనే అనుమాలొచ్చాయి.


ఇప్పుడు రోహిణి కార్తె రేపట్నించి ప్రారంభమై జూన్ 8 వరకూ ఉండనుండటంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండనుందే హెచ్చరికలు జారీ అయ్యాయి. మరో పదిరోజులపాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రత, వడగాల్పులు వీయవచ్చు, ఈ క్రమంలో ఎండదెబ్బ తగలకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ నీళ్లు ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలి. నీళ్లు కూడా ఫ్రిజ్ లోనివి కాకుండా మట్టి కుండలోనివి తాగాలి. నీళ్లతో పాటు మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావ, ఫాలుదా తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అదే సమయంలో ఫ్రై పదార్ధాలు, ఆయిలీ పదార్ధాలు, పికిల్స్ , మసాలా పదార్ధాలు తీసుకోవడం మంచిది కాదు.


రేపట్నించి ఎండల తీవ్రత ప్రభావం లేకుండా ఉండేందుకు రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. ఎక్కువగా తేలికగా, వదులుగా ఉన్న కాటన్ బట్టలు ధరించడం మంచిది. అటు పశు పక్ష్యాదులకు కూడా నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం అంచి అలవాటు.


Also readHealthy Breakfast: బలమైన ఇమ్యూనిటీ కావాలంటే రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది తీసుకోవల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook