Walking Tips: ప్రస్తుత రోజుల్లో ఎదుర్కొంటున్న వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం స్థూలకాయం లేదా అధిక బరువు. అధిక బరువు కారణంగానే డయాబెటిస్ , కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుంటాయి. ఈ పరిస్థితి గుండెపోటుకు కారణమౌతుంటుంది. అందుకే ముందు చేయాల్సింది బరువు నియంత్రణ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గించడం అనేది చెప్పినంత సులభం కాదు. వాకింగ్ లేదా వ్యాయామం చేస్తే బరువు తగ్గించుకోవచ్చని కొందరు, డైటింగ్‌తో బరువు తగ్గవచ్చని మరి కొందరు చెబుతుంటారు. అయితే అందరికీ ఇది సాధ్యం కాదు. కొందరికైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని కలోమీటర్లు నడవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలి, డైట్ ఎలా ఉండాలనే ప్రశ్నలు నిరంతరం వేధిస్తుంటాయి. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఓ పది కిలోలు బరువు తగ్గాలంటే నెల రోజుల వ్యవధిలో రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడవాల్సి వస్తుందనే ప్రశ్న కూడా రాకమానదు. వాస్తవానికి బరువు తగ్గేందుకు రోజుకు ఇన్ని కిలోమీటర్లు నడవాలనే నిబంధనేదీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కో పరిస్థితి ఉంటుంది. 


అదే సమయంలో రోజుకు నడిచే కిలోమీటర్లను బట్టి ఎన్ని కేలరీలు బర్న్ అవుతాయనేది చెప్పవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన ఓ అధ్యయనం ప్రకారం 1 మైలు అంటే 1.6 కిలోమీటర్లు నడిస్తే 55-140 కేలరీలు కరుగుతాయి. అంటే కేలరీల బర్నింగ్ విషయంలో కూడా తేడా ఉంటుంది. ఆ వ్యక్తి నడక విధానం, వేగం, తీసుకునే సమయాన్ని బట్టి కేలరీలు బర్న్ అవుతాయి. స్లో వాకింగ్ అంటే నిదానంగా చేసే నడక రోజుకు రెండున్నర గంటలుండాలని యూకేకు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది. అదే ఫాస్ట్ వాకింగ్ అయితే రోజుకు గంటన్నర సరిపోతుందట.


నేషనల్ హెల్త్ సర్వీ స్ చెప్పినట్టు రోజుకు ఆ విధంగా నడిస్తే కొంతమంది నెలరోజుల్లో 10 కిలోల బరువు తగ్గితే మరి కొంతమందికి రెండు నెలల సమయం పట్టవచ్చు. ఇంకొంతమంది నెలకు 2-3 కిలోలకంటే ఎక్కువ తగ్గని పరిస్థితి ఉంటుంది. దీన్ని బట్టి అర్ధమయ్యేది ఒకటే. ఎంత బరువు తగ్గుతామనేది మనిషిని బట్టి మారుతుంటుంది. మనిషి శరీర తత్వం, శరీరంలో ఉండే కొవ్వు, ఆ మనిషి వాకింగ్ లేదా వ్యాయామ విధానం, తీసుకునే ఆహారాన్ని బట్టి మారుతుంటుంది.


బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ చెప్పినట్టు నడుస్తూనే..న్యూట్రిషనిస్టులు చెప్పే డైట్ పాటిస్తే కచ్చితంగా ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. ఎక్కువమంది నిపుణులు చెప్పే సూచనల ప్రకారం గంటకు కనీసం 6 కిలోమీటర్ల వేగంతో నడక ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే కేలరీలు మరింత వేగంగా బర్న్ అవుతాయని గుర్తుంచుకోవాలి. దీనికి తగ్గట్టు తీసుకునే ఆహారం ఆరోగ్యంగా ఉండాలి. రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. దాంతోపాటు రాత్రి నిద్ర 7-8 గంటలు కచ్చితంగా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే మీ అధిక బరువును కేవలం మీ నడక ఒక్కటే నియంత్రించజాలదు. 


Also readl: Sleeping Tips: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా, ఈ బ్రిటన్ ఫార్ములా పాటించి చూడండి, సుఖమైన నిద్ర రాకపోతే ఒట్టు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook