Memory Tips: మనిషి చేసే ప్రతి పనినీ నిర్దేశించేంది, సూచనలు జారీ చేసేది మస్తిష్కమే. మెదడు పనితీరు సక్రమంగా ఉన్నంతవరకే ఇదంతా. మానిసక ఆరోగ్యం చెడితే ప్రతికూల ప్రభావం నేరుగా మెదడుపైనే పడుతుంటుంది. అదే జరిగితే జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. ఇటీవలి జీవన విధానంలో చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్న పరిస్థితి. ఈ పరిస్థితికి కారణమేంటి, ఎలా చెక్ చెప్పాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విభిన్న రకాల జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యంపై పలు విధాలుగా ప్రభావం చూపిస్తున్నాయి. స్థూలకాయం, మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటివి ప్రధాన సమస్యలు. వీటితో పాటు మెదడు పనితీరు క్షీణించడం అంటే జ్ఞాపకశక్తి మందగించడం కూడా మరో సమస్యగా ఉంది. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతుంటారు. అప్పుడే తీసిన కళ్లజోడు గానీ, అప్పటి వరకూ చేతిలో ఉన్న తాళం లేదా మొబైల్ ఫోన్ ఎక్కడ పెట్టారో మర్చిపోతుంటాం. అసలు ఓ చోట పెట్టామనే సంగతే గుర్తుకురాదు. అంటే మీ మెదడు పని తీరు మందగిస్తోందని అర్ధం. మీ మస్తిష్కం చిన్న చిన్న విషయాల్ని భద్రపర్చుకోలేకపోతోంది. 


చాలా సందర్భాల్లో ఇంటి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారో మర్చిపోతుంటారు. ఏ పనిపై బయటకు వెళ్లారో మర్చిపోయి..మరో పని పూర్తి చేసుకుని వస్తుంటారు. ఈ పరిస్థితికి కారణం మెదడు పనితీరు సరిగ్గా లేకపోవడం. మెదడుకి విశ్రాంతి లేకపోవడమే. దాంతో మెదడు సామర్ధ్యం తగ్గిపోతోంది. అందుకే ఏ విషయం గుర్తుంచుకోలేకపోతున్నారు. చదివింది మర్చిపోవడంతో విద్యార్ధులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్యకు పరిష్కారం లేకపోలేదు. జ్ఞాపకశక్తిని పెంచే 5 అద్భుతమైన చిట్కాలున్నాయి..


మెదడు పనితీరు సక్రమంగా ఉండాలంటే ముందు కావల్సింది ఆక్సిజన్ సరఫరా సరిగ్గా ఉండటం. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే మనిషికి ప్రమాదకరం. ఆక్సిజన్ సరఫరా ఆగితే ప్రాణాలే పోతుంటాయి. శరీరంలో ఆక్సిజన్ సరైన మోతాదులోలేకపోతే ఆ ప్రభావం మస్తిష్కంపై స్పష్టంగా పడుతుంది. దీనికోసం సాధ్యమైనంతవరకూ రెడ్, పింక్ కలర్ ఫ్రూట్స్, కూరగాయలు, పుచ్చకాయ, టొమాటో వంటి వస్తువులు తీసుకోవాలి. 


ఇక రెండవది నిద్ర. అన్నింటికంటే మించి జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు నిద్ర చాలా అవసరం. రోజుకు కనీసం 7-8 గంటల రాత్రి నిద్ర కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మెదడుకు కూడా విశ్రాంతి అవసరం. సూర్యాస్తమయం తరువాత పడుకుని..సూర్యోదయానికి ముందు లేవడం అంటే ఎర్తీ టు బెడ్ ఎర్టీ టు రైజ్ అలవాటు చేసుకోవాలి.


జ్ఞాపకశక్తిని పెంచేందుకు పలు ఆయుర్వేద మూలికలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో అశ్వగంధ, బకోపా, ధూతి, నెయ్యి వంటి పదార్ధాలున్నాయి. వీటిని ఓ క్రమ పద్ధతిలో వినియోగిస్తే మెదడు సామర్ధ్యం కచ్చితంగా పెరుగుతుంది. 


మెదడు పనితీరు బాగుండాలంటే పోషక పదార్ధాలు అన్నీ సక్రమంగా అందాలి. దీనికోసం బాదం, కిస్మిస్, ఖర్జూరం, నెయ్యి, జైతూన్ ఆయిల్, పప్పులు, బీన్స్, పన్నీర్, నల్ల మిరియాలు, జీలకర్రతో పాటు సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి.  


హెర్బల్ టీ కూడా జ్ఞాపకశక్తిని పెంచడంలో అద్బుతంగా ఉపయోగపడుతోంది. ఇది మెదడు సామర్ధ్యాన్ని, శక్తిని పెంచుతుంది. మతిమరపు సమస్యతో బాధపడేవారికి హెర్బల్ టీ అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇంట్లోనే తులసి, పసుపు, వాము, హింగ్ కలిపి స్వయంగా హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు. 


Also read: Breakfast Diet: రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఏది తినాలి, ఏది తినకూడదో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook