Sleeping Habits: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా...అయితే ఇలా చేయండి
Sleeping Habits: మనిషి ఆరోగ్యంగా ఉండటమనేది పూర్తిగా ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. జీవనశైలి సరిగ్గా ఉంటేనే ఆరోగ్యం ఫిట్ అండ్ హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల అలవాట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి.
Sleeping Habits: ప్రతి మనిషికి నిద్ర చాలా ముఖ్యం. రోజుకు రాత్రి వేళ కనీసం 7-8 గంటల నిద్ర తప్పకుండా ఉండాలి. ఒకవేళ నిద్ర తక్కువైతే అది కాస్తా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఆధునిక జీవన విధానంలో చాలామంది నిద్ర లేకుండా సతమతమౌతున్నారు. దీనికి కారణమేంటి, ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలనేది తెలుసుకుందాం..
చాలామంది రాత్రిళ్లు నిద్ర పట్టక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఫలితంగా ఉదయం లేవగానే చాలా చికాకు ప్రదర్శిస్తుంటారు. కేవలం మానసికంగానే కాకుండా ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల స్థూలకాయం, గుండె వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం ఉంటుంది. అందుకే రాత్రి వేళ నిద్ర పట్టకపోతే కొన్ని సూచనలు తప్పకుండా ఫాలో కావల్సి ఉంటుంది.
నిద్రించేముందు కడుపు నిండుగా ఉంటే నిద్ర పట్టడం కష్టమౌతుంది. అందుకే రాత్రి పూట భోజనం ఎప్పుడూ సాధ్యమైనంత వరకూ తేలిగ్గా ఉండాలి. రాత్రి ఎప్పుడూ నిద్రపోవడానికి 2 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాల్సి ఉంటుంది. రాత్రి వేళ నిద్ర పట్టకపోవడానికి కారణం ఆ గదిలో వెలుగు కూడా. అంటే నిద్ర పోవడానికి 1-2 గంటల ముందే టీవీ, మొబైల్ ఫోన్స్ వంటివి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. గదిలో లైట్ కూడా తక్కువగా ఉండాలి.
రాత్రి వేళ నిద్ర సరిగ్గా పట్టాలంటే వ్యాయామం ఉండాలి. వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. నిద్రపోవడానికి కాస్సేపు ముందు తేలికపాటి వ్యాయామం ఉంటే మంచి నిద్ర పడుతుంది. నిద్రపోవడానికి ముందు ఫోన్ వినియోగించడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. అందుకే నిద్రపోయేముందు మొబైల్ ఫోన్ వాడకం తగ్గించుకోవాలి.
కెఫీన్ అనేది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే కెఫీన్ ప్రబావం ఆరోగ్యంపై గంటల తరబడి ఉంటుంది. అందుకే సాయంత్రం వేళ కాఫీ లేదా టీ తాగడం వల్ల ఆ రోజు రాత్రి నిద్రకు భంగం వాటిల్లుతుంది. మద్యం వల్ల మత్తు రావచ్చు గానీ మద్యం తాగడం వల్ల ప్రశాంతమైన నిద్ర ఉండదు. నిద్ర తరచూ భంగం కలుగుతుంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook