Weight Loss: మీ డైట్‌లో ఈ పదార్ధాలుంటే బరువు వేగంగా తగ్గడం ఖాయం
Weight Loss: ఇటీవలి కాలంలో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలి, ఎలాంటి పద్ధతులు అవలంభించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Weight Loss: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు లేదా స్థూలకాయం పెను సమస్యగా మారుతోంది. వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సహజసిద్ధంగా లభించే కొన్ని పదార్దాలతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఎలాగో చూద్దాం.
స్థూలకాయంతో బాధపడేవారు ముఖ్యంగా కొన్ని విషయాల్ని గుర్తుంచుకోవాలి. ఇవి ఆహారపు అలవాట్లకు సంబంధించినవి. హెల్తీ ఫుడ్స్ ప్రతిరోజూ తీసుకోవాలి. రోజూ డైట్‌లో హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే అధిక బరువు సుంచి క్రమంగా ఉపశమనం పొందవచ్చు. స్థూలకాయం తగ్గించుకునేందుకు రోజూ డైట్‌లో కొన్ని ప్రత్యేకమైన ఆహర పదార్ధాలు తీసుకోవల్సి ఉంటుంది.
అన్నింటికంటే ముఖ్యమైనవి పండ్లు. పండ్లను ఎప్పుడూ ఇంట్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే స్వీట్స్ తినాలనే కోరికను పండ్లు అణచివేస్తుంటాయి. మీక్కూడా స్వీట్స్ తినాలన్పిస్తుంటే పండ్లు తినడం అలవాటు చేసుకోండి. దీనివల్ల క్రమంగా బరువు తగ్గుతారు. ఇక బరువు తగ్గించేందుకు అవసరమైన మరో పదార్ధం గుడ్లు. ప్రతిరోజూ గుడ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇంట్లో గుడ్లు ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. గుడ్లు శరీరం మెటబోలిజం ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఫలితంగా బరువు క్రమంగా తగ్గుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడకబెట్టిన గుడ్డు రొజుకొకటి తింటే మంచి ఫలితాలుంటాయి.
డార్క్ చాకొలేట్స్ కూడా మంచి ప్రత్యామ్నాయం. డార్క్ చాకొలేట్స్ ద్వారా బరువు తగ్గించే ప్రక్రియ ప్రారంభించవచ్చు. ఎందుకంటే డార్క్ చాకొలేట్లు తిన్నప్పుడు ఆకలి ఎక్కువ సేపు వేయకుండా ఉంటుంది. అలాగని డార్క్ చాకొలేట్స్ ఎక్కువ తీసుకోకూడదు. బరువు తగ్గించుకోవాలంటే ఆకు కూరలు అద్భుతంగా ఉపయోగపడతాయి. వారంలో కనీసం 4 సార్లు ఆకు కూరలు తినడం అలవాటు చేసుకుంటే బరువు సులభంగా వేగంగా తగ్గించుకోవచ్చు. ఆకుకూరలతో పాటు బీన్స్, మష్రూం వంటివి కూడా బరువు తగ్గించేందుకు దోహదపడే పదార్ధాలు.
Also read: Diabetes Risk: రోజూ ఈ పదార్ధాలు తీసుకుంటే మధుమేహం ముప్పుండదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook