How Pumpkin Seeds Can Benefit Men's Health: గుమ్మడికాయ గింజలు వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గింజల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్లుతోపాటు ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫోలేట్‌ , ఫ్యాటీ యాసిడ్స్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, జింక్ సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడి గింజలు తినడం వల్ల ఒత్తిడి దూరమయ్యి..నిద్ర బాగా పడుతుంది. లైంగిక సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్య ఔషధమనే చెప్పాలి. గుమ్మడి గింజల ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుమ్మడికాయ గింజల ప్రయోజనాలు
** గుమ్మడి గింజలు తినడం వల్ల అనేక చర్మ సమస్యలు దూరమవుతాయి. 
** బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. 
** ఉదర సంబంధిత వ్యాధులకు చెక్ పెడుతుంది. 
** మీ శరీరంలో రక్తానికి లోటు ఉండదు.
** మూత్ర విసర్జన, యూటీఐ వంటి సమస్యలను దూరం చేస్తుంది
** రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
** బీపీని కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. 
** పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
** గుమ్మడి గింజలలో జింక్ పుష్కలంగా ఉంటుంది, దీంతో మీ స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది. 


ఏ సమయంలో తినాలి?
మీరు గుమ్మడి గింజలను అల్పాహారంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా మీరు పడుకునే ముందు కూడా వీటిని తినవచ్చు.  


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)    


Also Read; Uric Acid: కేవలం రూ.2తో యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవచ్చు..ఎలాగో తెలుసా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook