Food To Keep Your Body Warm in Winters: ప్రస్తుతం భారత్‌లో శీతాకాలం ప్రారంభమైంది. అయితే ఈ క్రమంలో చలి తీవ్రత ఘనంగా పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్ని బట్టలు వేసుకున్నా చలిని తట్టుకోలేని వారు కొందరున్నారు. అలాంటి వారు తమ శరీరాన్ని చలి నుంచి రక్షించుకునేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అయితే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి సహాయపడే వాటిలో దుస్తువులే కాకుండా ఆహారాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఈ క్రమంలో పలు ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారాలను తీసుకుంటే సులభంగా శరీరాన్ని చలి నుంచి కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలికాలంలో ఇవి తప్పని సరి:
అల్లం టీ తాగండి:

చలి కాలంలో ప్రతి రోజూ అల్లం టీ తాగితే శరీరం వెచ్చగా తయారవుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చలి కాలంలో శరీరం వెచ్చగా కూడా తయారవుతుంది. కాబట్టి తప్పకుండా అల్లం టీని తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


చిలగడదుంప:
చలికాలంలో చిలగడదుంప శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే సులభంగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యంగ, కళ్ల సమస్యలు దూరమవుతాయి.


అరటిపండు:
అరటిపండులో విటమిన్ బి, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి.  వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మానసిక స్థితి కూడా మెరుగు పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజూ అరటి పండు తింటే శరీరం దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా శరీరం చలి కాలంలో వేడిగా మారుతుంది.


కాఫీ:
కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను పెంచుతుంది. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఎందుకంటే ఇందులో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.


Also Read :  Samantha Cries: అంతా అయిపోయింది అనిపించింది.. అరుదైన వ్యాధి గురించి చెబుతూ ఏడ్చేసిన సమంత!


Also Read : Bigg Boss Faima : నామినేషన్లో దిగజారుతూనే ఉన్నారు.. ఒళ్లు మరిచిపోతోన్న ఫైమా, శ్రీహాన్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook