Almond Benefits: బాదం పప్పు పోషకాల గని. దీనిని బాదం వెన్న, బాదం పాలు మరియు బాదం నూనె తయారీలో కూడా ఉపయోగిస్తారు. బాదం పప్పును పచ్చిగా తినడంతోపాటు వివిధ రకాల వంటకాల్లో కూడా వాడతారు. ఇందులో ఎన్నో రకాల ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు మరియు ఫైబర్లు సమృద్ధిగా లభిస్తాయి. సాధారణంగా దీనిని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తింటారు. ఈ బాదంను మనదేశంలో జమ్మూకశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా ఆల్మండలో పుష్కలంగా ఉంటాయి. బాదం పప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాదం పప్పు ఉపయోగాలు
** రోజూ బాదం తినడం వల్ల మీ నడుమ చుట్టు ఉన్న కొవ్వు కరుగుతుంది. తద్వారా మీరు బరువు తగ్గుతారు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
** బాదం పప్పు తినడం వల్ల మెదడు పనితీరు బాగుంటుంది. తద్వారా మీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. 
** ఎముకలు గట్టి పడటానికి, బోన్స్ ఆరోగ్యంగా ఉండటానికి బాదం అద్భుతంగా పనిచేస్తుంది. 
** డయాబెటిస్ రోగులకు బాదం దివ్యౌషదమనే చెప్పాలి. ఇది రక్తం‌లో చక్కెర స్థాయిలను సూపర్ పనిచేస్తుంది.
** బాదం తినడం వల్ల రొమ్ము క్యా‌న్సర్, ప్రొస్టేట్ క్యా‌న్సర్లు వంటివి రావు.
** ఆల్మండ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. 


Also Read: Garlic benefits: వామ్మో... వెల్లుల్లి తినడం ఇన్ని ప్రయోజనాలున్నాయా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.