Jaggery Benefits: మన ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. ఈకోవకు చెందినదే బెల్లం శనగపప్పు. ఇవి రెండు కలిపి తినడం శరీరానికి చాలా మంచిది. ఈ రెండింటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తాయి. బెల్లం, శనగపప్పు కలిపి తినడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెల్లం, శనగపప్పు ప్రయోజనాలు...
1. బెల్లం పప్పు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
2. బెల్లంలో ఐరన్, మాంసకృత్తులు పుష్కలంగా ఉన్నందున రక్తహీనత సమస్య ఉండదు. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
3. బెల్లం పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.  
4. శరీరం యొక్క శక్తి స్థాయిని పెంచడంలో సహాయపడే గుర్ చానా అనేది వ్యాయామం తర్వాత ఒక ఆదర్శవంతమైన చిరుతిండి.
5. బెల్లం పప్పులో భాస్వరం సమృద్ధిగా ఉంటుంది. ఇది దంతాలు చెడిపోకుండా కాపాడుుతుంది.  
6. ఈ రెండింటిలో ఉండే పొటాషియం గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా బీపీని అదుపులో ఉంచుంది. 
7. మూత్ర సమస్యకు బెల్లం మరియు శనగపప్పు మిశ్రమం చెక్ పెడుతుంది. 
8. ఇది మలబద్దకాన్ని దూరం చేస్తుంది. ఎముకలను గట్టి పరుస్తుంది. 


Also Read: Fenugreeks Benefits: మెంతులతో మైండ్ బ్లాక్ అయ్యే బెనిఫిట్స్..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook