Coconut Water Benefits: ఎండా కాలం మెుదలయింది. భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజూకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ వేడి కారణంగా చాలా మందికి వడదెబ్బ తగలడం, డ్రీహైడ్రేషన్ కు గురవడం జరుగుతుంది. ఈ ఎండ వేడి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రోజూ ఒక్క గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగండి చాలు. కొబ్బరి నీళ్లలో మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ. వైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. కొకొనట్ వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొబ్బరి నీరు తాగడం వల్ల బెనిఫిట్స్


కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ కు గురవ్వరు, అలసట ఉండదు.  బీపీ కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. వాంతులు, విరేచనాలతో బాధపడే వారు ఈ కొకొనట్ వాటర్ తాగితే చాలా వెంటనే ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇది అల్సర్ వంటి సమస్యలను కూడా అరికడుతుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇన్ ఫెక్షన్ల రాకుండా చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ముఖానికి మంచి నిగారింపును కూడా ఇస్తుంది. కిడ్నీలో రాళ్లను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.


Also Read: Watermelon Seeds: పుచ్చకాయ గింజలతో నమ్మశక్యం కాని ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవుతారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook