Weight Loss Tips: ప్రస్తుత రోజుల్లో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపించే స్థూలకాయం నుంచి ఉపశమనం పొందేందుకు సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి, ఒత్తిడి ఇలా వివిధ కారణాలతో అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. ఇదే సమస్య అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. ఒకేచోట కూర్చుని గంటల తరబడి పని చేస్తుండటం వల్ల ఫిజికల్ యాక్టివిటీ లోపిస్తోంది. దాంతో స్థూలకాయం పెరిగిపోతోంది. బరువు తగ్గేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మీక్కూడా వేగంగా బరువు తగ్గించుకోవాలనుంటే.. కివీ, దానిమ్మ జ్యుస్ ట్రై చేస్తే మంచి ఫలితాలుంటాయి. దానిమ్మ, కివీ జ్యూస్‌లో ఉండే పోషక పదార్ధాలతో కొవ్వు వేగంగా కరుగుతుంది. స్థూలకాయం ఏ విధంగా తగ్గించుకోవచ్చో చూద్దాం..


కివీలోని పోషక పదార్ధాలు


కివీలో విటమిన్ సి సంపూర్ణంగా ఉంటుంది. కివీలో..నారింజ కంటే రెండు రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అంతేకాకుండా కివీలో పొటాషియం, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే రోజూ కివీ సేవిస్తే శరీరం మెటబోలిజం వృద్ధి చెందుతుంది. మీ బరువు సులభంగా తగ్గుతారు. 


దానిమ్మలో పోషక పదార్ధాలు


దానిమ్మలో విటమిన్ సి, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. మిగిలిన పండ్లతో పోలిస్తే దానిమ్మలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో విటమిన్ బి6, ఫోలేట్ పొటాషియం, ఐరన్ ఉంటాయి. అందుకే ప్రతిరోజూ దానిమ్మ తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


కివీ, దానిమ్మ ఎలా తీసుకోవాలి


బరువు తగ్గించుకునేందుకు 2 కప్పుల దానిమ్మ, ఒక కప్పు కివీ మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంగా గాఢంగా ఉన్నట్టు అన్పిస్తే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు లేదా నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.


Also read: Detoxing Body: శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు సులభమైన చిట్కాలు ఇవే, 3 వారాలు చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook