Guava Side Effects: జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఫ్రూట్ లో విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్, జింక్, కాపర్, కార్బోహైడ్రేట్, యాంటీ డయాబెటిక్, యాంటీ డయేరియా, యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఫంగల్ వంటి గుణాలు ఉన్నాయి. అందుకే దీనిని పేదవాడి ఆపిల్ అంటారు. ఈ పండు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ కొందరు దీనిని తినకూడదు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు జామ పండ్లను తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు బారిన పడతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జామపండు తినడం వల్ల కలిగే నష్టాలు
** జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు జామపండును అస్సలు తినకూడదు. ఒక వేళ మీరు తిన్నట్లయితే వీటి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.
** తామరతో బాధపడుతున్న వ్యక్తులు జామపండును తినకుండా ఉంటే మంచిది. ఎందుకంటే దీనిని తిన్న తర్వాత మీకు చికాకు మరియు దురద వంటివి కలుగుతాయి. ఈసమయంలో జామ ఆకులను కూడా నమలకండి.
** కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారు జామపండ్లకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే ప్రక్టోజ్, విటమిన్ సి కారణంగా దీనిని తిన్న వెంటనే కడుపు ఉబ్బినట్లు అనిపిస్తోంది. 
** గర్భిణులు, పాలిచ్చే తల్లులు జామపండుకు దూరంగా ఉండాలి. ఇది ఆమెకు మరియు వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది.  
** మీరు ఏదైనా ఆపరేషన్ చేసుకోబోతున్నట్లయితే జామపండును 2 వారాల ముందుగానే తినడం మానేయండి, ఎందుకంటే ఈ ప్రూట్ తీసుకోవడం వల్ల రక్త ప్రసరణలో సమస్యలు తలెత్తుతాయి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: How To Reduce Cholesterol: ఈ 5 ఆయుర్వేద మూలికలు.. మీ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook