Weight Loss Without Diet: కొంతమంది ఎటువంటి డైట్ లేకుండా సులభంగా బరువు తగ్గుతారు. అయితే మరికొంతమంది ఎంత కష్టపడినా ఇంచ్ కూడా తగ్గరు. శరీరతత్వాన్ని బట్టి బరువు పెరగడం, తగ్గడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం మంచి పౌష్టికాహారం తీసుకుంటామో.. అప్పుడు ఆటోమేటిక్ గా మన శరీరం బరువు నియంత్రణలోకి వస్తుంది. మనం ఎంత తింటున్నాం.. ఎలా తింటున్నాం.. ఎప్పుడు తింటున్నాం.. అనే మూడు విషయాలను జాగ్రత్తగా గమనిస్తే ఎటువంటి కఠినమైన ఎక్ససైజులు, డైట్ చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా బరువు తగ్గవచ్చు. మరి అందుకు పాటించవలసిన కొన్ని విషయాలు ఏమిటో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజు పరగడుపున నిద్రలేచిన వెంటనే గోరు వెచ్చటి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా గోరువెచ్చటి నీరు తీసుకోవడం వల్ల మన ప్రేగులలోని మలినం బయటకు వెళ్తుంది. జీవక్రియ మెరుగుపడడంతో తిన్న ఆహారం సులభంగా అరిగి కొవ్వుగామారదు. మన పేగులు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో మన శరీరంలో అంత సులభంగా కొవ్వు నిల్వకాదు. కాబట్టి పేగులని ఆరోగ్యంగా ఉంచుకునే ఆహారాన్ని తీసుకోవాలి. భోజనం తర్వాత నీరు తీసుకోకూడదు. ఎప్పుడు కూడా భోజనానికి ఒక 20 నిమిషాల ముందు ఓ గ్లాసుడు మంచినీళ్లు తీసుకోవాలి. దీనివల్ల పొట్టనిండినా అనుభూతి కలిగి తక్కువ భోజనాన్ని తింటాం. 


మనం తినే ఆహారం కలర్ ఫుల్ గా ఉండాలి. అంటే అందులో అన్ని రకాల కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు వంటివి ఉండాలి. ఆహారాన్ని ఎప్పుడు కూడా కంగారుగా నోట్లోపెట్టుకొని గబగబా తినేయకూడదు.. నిదానంగా నమిలి తినాలి. అలా తినడం వలన ఆహారం సులభంగా అరుగుతుంది. పైగా నెమ్మదిగా తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి పొందుతాము.. కాబట్టి తక్కువ తింటాము. 


మనం రోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కూల్ డ్రింక్స్ కి వీలైనంత దూరంగా ఉండాలి. ఫ్రిడ్జ్ లో ఉంచి తీసిన చల్లటి నీళ్లు కూడా తీసుకోకూడదు. చక్కెర, ఉప్పు వంటివి వీలైనంతగా తక్కువ తినాలి. భోజనం తిన్న తర్వాత ఒక 20 నిమిషాలు నడక అలవాటు చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకోవడం.. లిఫ్ట్ బదులు మెట్లు వాడడం.. తేలికపాటి ఎక్ససైజులు చేసుకోవడం మన జీవన శైలిలో భాగంగా మారాలి. ఈ తేలికపాటి జాగ్రత్తలు తీసుకుంటే అస్సలు ఎవ్వరు బరువు పెరగరు.


ప్రస్తుతం ఉన్న హడావిడి జీవన శైలి వల్ల చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే కఠినమైన డైట్స్, గంటల కొద్ది వ్యాయామం చేసి బరువు తగ్గాలంటే అందరికీ సాధ్యపడేవిషయం కాదు కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు పాటిస్తే సరిపోద్ది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి