Hair Care: ఈ నేచురల్ ప్యాక్స్ తో.. శీతాకాలం కూడా మీ జుట్టు పదిలం..
Winter Tips: శీతాకాలం జుట్టు ఎక్కువగా పొడిబారిపోవడంతో పాటు బలహీన పడుతుంది. ఇంటి వద్దనే సహజంగా చేసుకున్న నాచురల్ ప్యాక్స్ ని ఉపయోగించి జుట్టును ఎలా బలంగా మార్చాలో తెలుసుకుందాం.
Winter Hair Care: వింటర్ సీజన్లో ఎంత శ్రద్ధ తీసుకున్న జుట్టు పొడిబారి పోయినట్లుగా మారుతుంది. ఈ కారణం చేత చాలా మంది హెయిర్ ఫాల్ లాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు. బయట వీచే చల్ల గాలుల కారణంగా.. పొల్యూషన్ కారణంగా.. జుట్టు పొడిబారడం ,నిర్జీవంగా మారడం, చివర్ల చిట్లిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే మళ్లీ వీటి కోసం మార్కెట్లో దొరికే కెమికల్స్ తో నిండిన ప్రొడక్ట్స్ వాడటం వల్ల సమస్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే ఈ సమస్య సహజసిద్ధంగా లభించే ఉత్పత్తులతో ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకుందాం.
చలికాలంలో ఇంటి వద్దనే న్యాచురల్ గా దొరికే వస్తువులను ఉపయోగించి తయారుచేసిన హెయిర్ ప్యాక్స్ మీ జుట్టుకు వాడడం వల్ల.. మీ కురులు మృదువుగా పట్టులా మెరవడమే కాకుండా.. కుదుళ్ల నుంచి దృఢంగా తయారవుతాయి. మరి ఆ పాక్స్ ఏమిటో తెలుసుకుందాం పదండి..
బనానా ప్యాక్:
మనం రోజు తినే అరటి పండులో ఎన్నో రకాల పౌష్టిక తత్వాలు ఉన్నాయి .ఇది మన పొడిబారిపోయిన జుట్టును సహజంగా మృదువుగా మారుస్తుంది. ఈ బనానా హెయిర్ ప్యాక్ కోసం బాగా మగ్గిన ఒక అరటిపండు పేస్టు తీసుకొని అందులో కాస్త ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి ఒక 30 నిమిషాల తర్వాత షాంపూతో గోరువెచ్చని నీటిని ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేసుకుంటే కండిషనర్ కూడా అవసరం లేకుండా మీ జుట్టు చాలా మృదువుగా మారుతుంది.
ఎగ్ ఓట్స్ ప్యాక్:
జుట్టుకు ఎప్పటినుంచో గుడ్డును వాడడం మనకు అలవాటు.గుడ్డులోని తెల్ల సొనకు కాస్త సెనగపిండి, బాదంపూడి ,ఓట్స్ పౌడర్ మిక్స్ చేసి ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకు బాగా పట్టించి ఒక అరగంట తర్వాత షాంపూతో కానీ కుంకుడు కాయతో కానీ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరగడమే కాకుండా చాలా మృదువుగా మారుతుంది.
బెండకాయ ప్యాక్:
బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి అంటారు. అదే బెండకాయని కాస్త నీళ్లలో ఉడకపెడితే జల్ లాగా ఫార్మ్ అవుతుంది. ఈ మిశ్రమాన్ని వడకట్టి.. జెల్ ను కుదుళ్లకు బాగా అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే.. మీ జుట్టు మృదువుగా మెరుస్తుంది.
ఇలా మనం పలు రకాల నేచురల్ ఉత్పత్తులను ఉపయోగించి హేర్ మాస్కులు తయారు చేసుకోవచ్చు. బయట మార్కెట్లో దొరికే కెమికల్స్ తో నిండిన ప్రొడక్ట్స్ కంటే కూడా చర్మానికి జుట్టుకి ఇలా సహజంగా ఇంట్లో చేసుకున్నా ఫాక్స్ వాడడం ఎంతో మంచిది.
గమనిక :పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది.కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook