Healthy Relationships: ప్రేమ, గౌరవం, స్వేచ్ఛ, నమ్మకం... ఇవి నాలుగు ఉన్నప్పుడే భార్యాభర్తల మధ్య సంబంధం సాఫీగా సాగుతుంది. అలాగే, సందర్భాన్ని బట్టి పట్టువిడుపులు, సర్దుకుపోవడం, అవసరమైతే ఒక మెట్టు తగ్గడం చేయాలి. అలా అని ఎప్పుడూ ఒకరే సర్దుకుపోవడం, రాజీపడటం చేస్తే రిలేషన్‌షిప్‌పై విసుగు పుట్టడం లేదా నమ్మకం పోవడం ఖాయం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రిలేషన్‌షిప్‌లో 4 విషయాల పట్ల ఎప్పుడూ రాజీ పడొద్దు. ఆ 4 ముఖ్య విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రొఫెషనల్ గోల్స్ 


రిలేషన్‌షిప్ ఎంత ముఖ్యమో జీవితంలో ఒక మంచి స్థానంలో ఉండేందుకు ప్రొఫెషనల్ గోల్స్ అంతే ముఖ్యం.  అప్పుడే మీ జీవిత భాగస్వామికి మంచి లైఫ్ ఇవ్వగలరు. కాబట్టి మీ జీవిత భాగస్వామి మీ ప్రొఫెషనల్ లైఫ్‌ను అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మీరూ మీ ప్రొఫెషనల్ లైఫ్‌ను, రిలేషన్‌షిప్‌ను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ తప్పితే అటు రిలేషన్‌షిప్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌పై ప్రభావం పడుతుంది. ప్రొఫెషనల్ గోల్స్ విషయంలో మీ జీవిత భాగస్వామికి ఓపికగా చెప్పేందుకు ప్రయత్నించాలి. ఆమె లేదా అతని సహకారంతో ముందుకెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. అంతే తప్ప రాజీపడి ప్రొఫెషనల్ లైఫ్‌లో వెనకబడి పోవద్దు. మంచి  రిలేషన్‌షిప్‌లో భార్యా లేదా భర్త.. ఎప్పుడూ ఒకరికొకరు అండగా ఉంటారు, అర్థం చేసుకుంటారు.


ఫ్యామిలీ, ఫ్రెండ్స్ :


మంచి రిలేషన్‌షిప్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణకు భార్యాభర్తల్లో ఎవరి ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులు ఇంటికొచ్చినా ఇద్దరూ వారిని గౌరవించాలి. మీ భార్య లేదా భర్త వారితో తగినంత సమయం  గడిపేందుకు స్వేచ్చనివ్వాలి. అంతే తప్ప ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ రావొద్దు.. వారితో రిలేషన్ కట్ చేసుకోమని మాట్లాడొద్దు. ఒకవేళ అలా మాట్లాడితే రిలేషన్‌షిప్‌లో సమస్యలు మొదలవుతాయి.


అలవాట్లు, అభిరుచులు 


భార్యాభర్తల ఇద్దరి అలవాట్లు, అభిరుచులు వేరుగా ఉండొచ్చు. ఈ విషయంలో ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఏకాంతంగా గడపాలనుకున్నప్పుడు ఆ మేరకు స్వేచ్చ ఇవ్వాలి. అంతే తప్ప నాలాగే ఉండాలి... నా అభిరుచులే ఫాలో అవాలనే పంతం పనికిరాదు. మంచి రిలేషన్‌షిప్‌లో పంతాల కన్నా పట్టువిడుపులే ముఖ్యం. అది ఉన్నపుడు మీ రిలేషన్‌షిప్ బలంగా ఉంటుంది.


మీ వ్యక్తిత్వం, స్వతంత్రత


పెళ్లయినంత మాత్రాన మీ వ్యక్తిత్వాన్ని, స్వతంత్రతను కోల్పోవాలని ఏమీ లేదు. మీకంటూ సొంత ఆలోచనలు, భావాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఆర్థికంగా జీవిత భాగస్వామిపై డిపెండ్ కావాలని ఏమీ లేదు. మీ ఆలోచనలు, భావాలు, మీ వ్యక్తిత్వాన్ని జీవిత భాగస్వామి అర్థం చేసుకుంటే రిలేషన్‌షిప్ సాఫీగా సాగుతుంది.


పైన చెప్పుకున్న అంశాల్లో జీవిత భాగస్వాముల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పుడు రిలేషన్‌షిప్ సాఫీగా సాగుతుంది. ఒకవేళ భిన్నాభిప్రాయాలు ఉన్నా ఒకరికొకరు నచ్చజెప్పేలా, అర్థం చేయించేలా ప్రయత్నించాలి. అయితే ఎప్పుడూ ఒకరే రాజీపడటం రిలేషన్‌షిప్‌పై  ప్రభావం చూపిస్తుందని.. ఎక్కువగా రాజీపడాల్సి వస్తోందంటే ప్రేమ, స్వేచ్చ, నమ్మకం,గౌరవాన్ని కోల్పోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


Also Read: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 80'స్ బాహుబలి సింహాసనం' రీ రిలీజ్!


Also Read: Chennupati Gandhi: ఇనుపచువ్వతో టీడీపీ నేత కన్ను పొడిచేశారు.. విజయవాడలో వైసీపీ నేతల కిరాతకం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook