Healthy Weight Loss: ఆధునిక పోటీ ప్రపంచంలో బెల్లీ ఫ్యాట్, స్థూలకాయం అనేవి ప్రధాన సమస్యలు. అధిక బరువును ఎప్పుడూ సహజసిద్ధంగానే అంటే ఆరోగ్యకరంగానే తగ్గించుకోవాలి. లేకుంటే అనర్ధాలు ఎదురౌతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిజీ ప్రపంచం కారణంగా జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లతో స్థూలకాయం పెను సవాలుగా మారింది. బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. డైటింగ్ చేయడం, వర్కవుట్లు చేయడం ఇలా ఎవరికి నచ్చింది వాళ్లు చేస్తుంటారు. బరువు తగ్గడమనేది ఆరోగ్యంగా సాగాలి తప్ప..అసహజంగా ఉండకూడదు. అంటే బరువు తగ్గించుకోవడమనేది సహజ సిద్ధంగా జరగాలి. కృత్రిమ పద్ధతుల్లో జరిగితే అనారోగ్యం వెంటాడుతుంది. 


పూర్తి ఆరోగ్యంగా బరువు తగ్గించుకోవాలంటే..పెరుగు అద్భుత ఔషధమంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇవాళే మీ డైట్‌లో చేర్చుకుంటే కొన్ని వారాల్లోనే మంచి ఫలితాలుంటాయి. పెరుగుతో బరువు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..


సహజసిద్ధంగా బరువు తగ్గించేందుకు పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగు అనేది ఒక ప్రో బయోటిక్ ఫుడ్. ఇది శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. పెరుగులో ఉండే ప్రో బయోటిక్స్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మెటబోలిజంను వృద్ధి చేస్తుంది. మెటబోలిజం ఎప్పుడైతే మెరుగ్గా ఉంటుందో..సహజంగానే బరువు తగ్గుతారు. పెరుగులో ఉండే ప్రోటీన్ల కారణంగా కడుపు నిండినట్టుగా ఉండి..ఆకలేయదు. పెరుగు నేరుగా తినడం ఇష్టం లేకపోతే..కొద్దిగా నల్ల మిరియాల పౌడర్ చల్లుకుని తాగవచ్చు. ఈ రెండింటి మిశ్రమం ఆరోగ్యానికి చాలా మంచిది.


స్థూలకాయం సమస్య నుంచి గట్టెక్కేందుకు పెరుగును ఏ రూపంలో తీసుకున్నా ఫరవాలేదు. పెరుగు నేరుగా తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలుంటాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మద్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్‌లో తప్పకుండా తీసుకోవాలి. ఫలితంగా తిండి యావ తగ్గి..నెమ్మదిగా బరువు నియంత్రణలో ఉంటుంది. పెరుగుతో పాటు డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసి కలుపుకుని తాగితే ఇంకా మెరుగైన ఫలితాలుంటాయి. శరీరానికి కావల్సిన పౌష్ఠిక పదార్ధాలు లభిస్తాయి. 


Also read: Ginger jaggery Tea: టీ ఆరోగ్యానికి మంచిదా కాదా, అల్లం-బెల్లం టీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook