Heart Healthy: గుండె ఆరోగ్యానికి 5 కూరగాయలు.. ఇవి మీ డైట్లో తప్పనిసరి..
Heart Healthy Vegetables: ఆకు కూరలు అయిన పాలకూర, కాలే వంటివి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ కే ఉంటుంది. రక్తంలో గడ్డ కట్టకుండా చేస్తాయి. ఇవి గుండెలో ఫలకాలు ఏర్పడకుండా కాపాడతాయి. కూరగాయలు డైటరీ నైట్రేట్స్ అధిక మోతాదులో ఉంటాయి. బీపీ స్థాయిలను తగ్గిస్తుంది.
Heart Healthy Vegetables: గుండె ఆరోగ్యానికి ఆకుకూరలు తినాలి. ముఖ్యంగా ఇందులో ఖనిజాలు పుష్కలం కాబట్టి గుండెను బలంగా మారుస్తుంది. దీంతో గుండెపోటు సమస్యలు తగ్గుతాయి. కొన్ని రకాల ఆహారాలు మన డైట్లో చేర్చుకుంటే గుండె నూరేళ్లపాటు ఆరోగ్యంగా ఉంటుంది. లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారాలు గుండెకు హాని చేస్తాయి. ఇలాంటివి మన డైట్లో చేర్చుకోవడం వల్ల గుండెకు మేలు చేస్తాయి.
కూరగాయలు..
ఆకు కూరలు అయిన పాలకూర, కాలే వంటివి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ కే ఉంటుంది. రక్తంలో గడ్డ కట్టకుండా చేస్తాయి. ఇవి గుండెలో ఫలకాలు ఏర్పడకుండా కాపాడతాయి. కూరగాయలు డైటరీ నైట్రేట్స్ అధిక మోతాదులో ఉంటాయి. బీపీ స్థాయిలను తగ్గిస్తుంది.
బీన్స్..
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది బీన్స్. ఇందులో జీర్ణక్రియను మెరుగుచేస్తుంది. బీన్స్ కడుపులో మంచి బ్యాక్టిరియా పెరగడానికి ప్రేరేపిస్తుంది. అంతేకాదు బీన్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాదు బీన్స్ బ్లడ్ ప్రెజర్‌ను అదుపులో ఉంచి కార్డియో సంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
ఇదీ చదవండి: ప్రతిరోజు చియా సీడ్స్ తింటే మీ శరీరంలో ఈ మార్పును కచ్చితంగా గమనిస్తారు తెలుసా?
సోయా బీన్..
వెబ్‌ఎండీ నివేధిక ప్రకారం సోయా బీన్‌ను ఎడమేమ్ అని పిలుస్తారు. ఇందులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. ఒక కప్పు ఎడమేమ్‌లో 8 గ్రాముల గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్ ఉంటుంది. మీకు ఫైబర్ పూర్తి మొత్తంలో అందాలంటే హోల్ వీట్ బ్రెడ్ తో పాటు తీసుకోవాలి.
టమాటాలు..
టమాటాల్లో లైకోపీన్ ఉంటుంది. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా నివారించే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడే గుణాలు ఉంటాయి. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఈ 5 మసాలాలు నిత్యం మీ డైట్లో ఉండాల్సిందే.. వాటి ఉపయోగాలు తెలిస్తే షాకే..
చిలగడదుంప..
వెబ్ ఎండీ నివేదిక ప్రకారం చిలగడ దుంప కూడా గుండెకు మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉంటుంది. చిలగడ దుంపలు రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వవు. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో ఫబర్, విటమిన్ ఏ, లైకోపీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది గుండె ఆరోగ్యానికి కూడ మేలు చేస్తుంది. చిలగడదుంపను రకరకాలుగా వండుకుని తినవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter