Heartburn Remedies: గుండెల్లో మంటకు ప్రధాన కారణాలు ఇవే.. అందుకే ఈ ఆహారాలను అస్సలు తినొద్దు..
Heartburn Remedies: గుండెల్లో మంట సమస్య ఓ సాధారణ సమస్యగా మారింది. అయితే ఈ సమస్య రావడానికి చాలా రకాల కారణాలున్నాయి. కాబట్టి తప్పకుండా అనారోగ్య సమస్యలు రాకుండా పలు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Heartburn Remedies: ప్రస్తుతం గుండెల్లో మంట సమస్య చాలా మందిలో సాధారణ సమస్యగా మారింది. అయితే ఈ సమస్య అసిడిటీ కారణంగా వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా మంది తరచుగా వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఛాతీలో నొప్పి మళ్లీ మళ్లీ వస్తే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటిచడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఛాతీలో మంట మళ్లీ మళ్లీ రావడానికి కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గుండెల్లో మంట కారణాలు ఇవే:
అనారోగ్యకరమైన ఆహారాలు:
చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చల విడిగా తింటున్నారు. అయితే దీని వల్ల కూడా గుండెల్లో మంట సమస్య రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు వాటిని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ధూమపానం:
చాలా మంది ప్రస్తుతం విచ్చల విడిగా ధూమపానం చేస్తున్నారు. అయితే దీని వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ధూమపానాన్ని చేయడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఒత్తిడి:
ఒత్తిడి, ఆందోళన సమస్యలు తీవ్ర సమస్యలుగా మారుతున్నాయి. అయితే ఈ సమస్యల కారణంగా కూడా గుండెల్లో మంట వస్తుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఒత్తిడి కారణంగా పానిక్ అటాక్ ప్రమాదం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒత్తిడి బారన పడకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
హార్మోన్లు:
హార్మోన్ల పెరుగుదల కారణంగా కూడా గుండెల్లో మంటలు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలో ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల అతిగా పెరగడం వల్ల గుండెల్లో మంట వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : Samantha Cries: అంతా అయిపోయింది అనిపించింది.. అరుదైన వ్యాధి గురించి చెబుతూ ఏడ్చేసిన సమంత!
Also Read : Bigg Boss Faima : నామినేషన్లో దిగజారుతూనే ఉన్నారు.. ఒళ్లు మరిచిపోతోన్న ఫైమా, శ్రీహాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook