Natural Remedies for Cholesterol: అన్ని ప్రాణులకు కొలెస్ట్రాల్ చాలా అవసరం. ఇందులో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి. ఆరోగ్యకరమైన కణాలు ఏర్పడాలన్న, శరీరం చురుగ్గా పనిచేయాలన్నా మంచి కొలెస్ట్రాల్ అవసరం. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. బాడీలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించే వంటింటి చిట్కాలేంటో తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొలెస్ట్రాల్ తగ్గించే మార్గాలు


1. పసుపు
ప్రతి ఇంటిలో కామన్ గా ఉండే పదార్థం పసుపు. ఇందులో కర్కుమిన్ ఉంటుంది. పసుపును ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. 
2. నల్ల మిరియాలు
పైపెరిన్ అనే యాంటీఆక్సిడెంట్ నల్ల మిరియాలలో లభిస్తుంది. బ్లాక్ పెప్పర్‌లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. 
3. దాల్చిన చెక్క
దాల్చిన చెక్కను మసాలాగా ఎక్కువగా ఉపయోగిస్తాం. దీనితో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
4. మెంతులు
మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. 
5. సెలెరీ
ఆకుకూరలు ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక వైద్య అవసరాలకు కూడా ఉపయోగిస్తారు. సెలెరీ అజ్వైన్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడటంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ ఉంచుతుంది. 


Also Read: Papaya Benefits: బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook