Heme Iron And Type 2 Diabetes: డయాబెటిస్ ఇప్పుడు చిన్న వయస్సు వారిని కూడా ఇబ్బంది పెడుతుంది అనేది నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఈ పరిస్థితికి కారణం మన జీవన శైలిలో వచ్చిన మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరకంగా చురుకుగా లేకపోవడం వంటి అనేక కారణాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. నేచర్ మెటబాలిజం జర్నల్‌ ప్రకారం మనం తినే ఆహారం కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా రెడ్ మీట్‌లో హేమ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని తగ్గించడం లేదా మొత్తం మానేయడం డయాబెటిస్ నివారణకు మంచి మార్గం. అయితే ఈ అధ్యయనం మాత్రమే కాకుండా ఇతర అధ్యయనాలు కూడా మాంసం తినడం డయాబెటిస్ మధ్య సంబంధం ఉందని సూచిస్తున్నాయి. అందుకే ఆరోగ్య నిపుణులు ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాలను తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.


శాకాహారులకు డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉండటానికి వైద్యులు చెబుతున్నారు. శాకాహార ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. సాధారణంగా, శాకాహార ఆహారాలు మాంసం ఆధారిత ఆహారాల కంటే తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. ఇది బరువు నియంత్రణకు దోహదపడుతుంది. బరువు తగ్గడం డయాబెటిస్ నిర్వహణకు చాలా ముఖ్యం. శాకాహార ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ సంబంధిత సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.


డయాబెటిస్‌ ఉన్నవారు తీసుకోవాల్సిన పదార్థాలు: 


రెడ్ మీట్‌లో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే రెడ్ మీట్ తీసుకోవడాన్ని తగ్గించడం మంచిది. జంతు ఆధారిత ప్రోటీన్‌లు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. అయితే, మాంసం అంతా చెడ్డదే కాదు. చికెన్, చేపలు వంటి లీన్ ప్రోటీన్‌లను మితంగా తీసుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి సహాయపడతాయి.


బ్రౌన్ రైస్, ఓట్స్, కొర్రగువ్వు వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శరీరంలో నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడానికి సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్, అవకాడో, గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మంచివి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.
 
డయాబెటిస్ నివారణ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు:


ఆరోగ్యకరమైన ఆహారం: ఎక్కువగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలి.
నడుము చుట్టూ కొవ్వు తగ్గించుకోవాలి.
రోజూ వ్యాయామం చేయాలి.
బరువును నియంత్రించుకోవాలి.
ధూమపానం, మద్యపానం చేయకూడదు.
రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి.


Disclaimer:


ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా వైద్య సమస్య ఉంటే, మీరు తప్పక మీ వైద్యుడిని సంప్రదించాలి.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.