Prevention Of Asthma:  ఆస్తమా అనేది జన్యు పరంగా వచ్చే సమస్య అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆస్తమా సమస్య బారిన పడితే జీవితాంతం ఈ సమస్యతో బాధపడడాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది.  ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే మందులు వాడే అవసరం లేకుండా సహజ పద్దతులతో ఆస్తమా తగ్గు ముఖం పడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  స‌హ‌జ ప‌ద్ద‌తుల ద్వారా ఆస్తమాను ఎలా త‌గ్గించుకోవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజు గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. 


ఈ ఆస్తమా సమస్య ఉన్నవారు వేడి నీటితో స్నానం చేయాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కఫం నుంచి ఉపశమనం పొందవచ్చు. 


ఆస్తమా ఉన్నవారు ఉప్పు లేని ఆహార పదార్థాలను తీసుకోవాలి. దీని వల్ల ఆస్తమా తగ్గుముఖం పడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


ఉప్పుకు బదులుగా నిమ్మరసం తీసుకోవడం వల్ల క‌ఫం ఎక్కువ‌గా త‌యారవ్వ‌కుండా ఉంటుంది.


ఈ ఆస్తమా సమస్య ఉన్నవారు కూరలు, ఆహార పదార్థాలు వేడిగా తీసుకోవాలి. 


ప్రతిరోజు ఉదయం పూట మొలకెత్తిన గింజలను, జామ కాయ వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.


ఈ విధంగా చెప్పిన చిట్కాలను పాటిస్తూ నాలుగు రోజులు ఆస్థమా మందులను వాడాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇన్హెలర్‌ అవసరం ఉండదు.  


 వెల్లుల్లి ఆస్తమా లక్షణాల నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది.ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి.  వెల్లుల్లి తీసుకోవడం ఆస్తమా నిర్వహణలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.


అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.దీని వల్ల ఎలాంటి హానికరమైన జబ్బుల దారిన పడకుండా ఉంటాం.


ఒమేగా 3 నూనె ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. దీని మీ అహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు పొందవచ్చు.  


చలికాలం, వర్షకాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో తలస్నానం, పుల్లటి పండ్లన, చల్లటి పానీయాలు తీసుకోకుండా ఉండాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


ఉప్పుతో పాటు పంచదార‌, బెల్లంతో చేసిన వాటిని, చ‌ల్ల‌టి ప‌దార్థాల‌ను కూడా తీసుకోవ‌డం మానేయాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా స‌హ‌జ ప‌ద్ద‌తుల ద్వారా చాలా సుల‌భంగా ఆస్తమా నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని  ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.