Rules to stay healthy :


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనుల వల్ల మన జీవితంపై ఎంతో పెద్ద ప్రభావం పడుతుంది. మనం తీసుకునే ఆహారం, జీవించే విధానం ఈ రెండు ఒక ఆరోగ్యకరమైన జీవితానికి ఎంతో అవసరం. అనాదిగా భారతదేశం ఆచరిస్తున్న ఆయుర్వేదం ప్రకారం కూడా కొన్ని సూత్రాలను పాటించడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. పండంటి ఆరోగ్యానికి అవసరమైన ఆ 12 సూత్రాలు ఏంటో తెలుసుకుందామా..


 


1.పొద్దు పోయే వరకు మేలుకోవడం పొద్దు ఎక్కాక నిద్ర లేవడం మానుకోవాలి. మనిషికి రోజు ఎనిమిది గంటల నిద్ర అవసరం కానీ అది సరైన సమయంలో తీసుకుంటేనే సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతిరోజు రాత్రి పది లోపు పడుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే పొద్దున 5 లేక 5:30 లోపు నిద్రలేయడం నేర్చుకోవాలి.


 


2.నిద్రలేచిన వెంటనే గోరువెచ్చటి నీటిని నెమ్మదిగా త్రాగడం అలవాటు చేసుకోవాలి. ఇక ఆ తరువాత కనీసం ఒక అరగంట ఆయన శ్వాసను మన అధీనంలో పెట్టే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. శరీరానికి మొబిలిటీ నిచ్చే స్ట్రచ్చింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయడం మంచిది.


 


3.చాలామంది బరువు తగ్గడానికి బ్రేక్ ఫాస్ట్ మానేయడం బెస్ట్ ఛాయిస్ అనుకుంటారు .కానీ అది చాలా తప్పు ,ఎట్టి పరిస్థితుల్లో పొద్దున అల్పాహారాన్ని అస్సలు మిస్ కాకూడదు. ఇలా చేయడం వల్ల తగ్గేమాట పక్కన పెడితే గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొంతమందిలో తెలియకుండా దీనివల్ల హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.


 


4.ప్రతిరోజు కనీసం మూడు లీటర్ల నీరు తాగడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. అలాగని మొత్తం మూడు లీటర్లు ఒకసారి తాగాల్సిన అవసరం లేదు .గంటన్నర గ్యాప్ తీసుకొని కనీసం ఒక గ్లాసు రెండు గ్లాసుల నీళ్లు మెల్లిగా తాగడం అలవాటు చేసుకోవాలి. నీటిని గబగబా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమీ లేవు.


 


5.భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు మొబైల్స్, టీవీ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వీలైనంత దూరంగా ఉంచడం మంచిది. భోజనం మీద ధ్యాస పెట్టి సరిగ్గా నమిలి మింగడం జీర్ణ వ్యవస్థకు ఎంతో అవసరం. టీవీ చూస్తూ , మాట్లాడుతూ తినడం వల్ల గబగబా తింటాం. ఇలాంటి ఆహారం శరీరంలో అనవసరపు కొవ్వుని నిలువ చేస్తుంది తప్ప శరీరానికి ఎటువంటి పోషకాలను అందివ్వదు.


 


6.రోజు కనీసం ఒక గంట సేపైనా కింద పద్మాసనం వేసుకొని కూర్చోవడం ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల వెన్ను వ్యవస్థ బలపడుతుంది. కాళ్లు ,కండరాలు సరియైన రీతిలో ఉండడమే కాకుండా శరీర బరువుపై నియంత్రణ ఉంటుంది.


 


7. రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. రోజు మజ్జిగ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.


 


8.అలాగే మధ్యాహ్నం ఒక 40 నిమిషాల పాటు రిలాక్స్డ్ గా ఉండాలి. రిలాక్స్ అంటే కళ్ళు మూసుకొని నిద్రపొమ్మని కాదు.. అలా కూర్చొని మీకు నచ్చిన మ్యూజిక్ వినడం లేక ఏదైనా ప్రశాంతమైన టీవీ షో లాంటివి చూడడం చేయవచ్చు.


 


9.రాత్రిపూట సూర్యాస్తమయం తరువాత ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. పొద్దుపోయిన తర్వాత తినేవారికి ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అందుకని పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.


 


10. సాయంత్రం భోజనం చేసిన తర్వాత కనీసం ఒక కిలోమీటర్ అయినా నడవడం అలవాటు చేసుకోవాలి. బయటకు వెళ్లి తిరిగే వస్తలేని వాళ్ళు కనీసం ఇంట్లో అయినా ఒక 100 అడుగుల దూరం నడవడం ఎంతో మంచిది.


 


11. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగాలి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఇలా పడుకునే ముందు గోరువెచ్చని పాలు తీసుకోవడం ఎంతో మంచిది.మరీ పని ఉండి మేలుకుంటే తప్ప ,అనవసరంగా 10 తర్వాత మేలుకోవడం శ్రేయస్కరం కాదు.


 


గమనిక:


పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేర సేకరించడం జరిగింది. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు మీ డాక్టర్ ను కన్సల్ట్ అవ్వడం ఎంతో మంచిది.


ఇది కూడా చదవండి: IND vs BAN Highlights: కోహ్లీ మెరుపు సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం..


 


ఇది కూడా చదవండి: Lava Blaze Pro 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు!


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


 


Android Link - https://bit.ly/3P3R74U


 


Apple Link - https://apple.co/3loQYe 


 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook