Hibiscus Face Pack: డార్క్ స్కిన్ కోసం హైబిస్కస్ ఫ్లవర్ ఫేస్ మాస్క్ ఇంట్లోనే ఇలా చేసుకోండి..
Hibiscus Benefits For Skin: మందారం పువ్వు కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా చర్మ సంరక్షణలో కూడా ఎంతో మేలు చేస్తుందని చర్మనిపుణులు చెబుతున్నారు. అయితే మందారం ఉపయోగించి ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Hibiscus Benefits For Skin: పూజలో పువ్వులకు ఎంతో ప్రముఖ్యత ఉంటుంది. అయితే ఇవి అందాన్ని ప్రత్యక్షంగా పెంచుతాయని చర్మనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మందార పువ్వు చర్మ సంరక్షణలో కీలక ప్రాత పోషిస్తుంది. ఈ పువ్వును ఉపయోగించి ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, మరకలు తొలగించుకోవచ్చు. అయితే చాలా మంది మందారం పువ్వును పూజలో ఉపయోగించిన పువ్వులను చెత్తలోకి విసిరేస్తారు. కానీ ఇవి ముఖాన్నికి ఎంతో మేలు చేస్తుంది.
మందారం మాల్చేసి కుటుంబానికి చెందిన పువ్వు. ఇవి ఎక్కువగా చైనా, సూడాన్, మలేషియాలో కనిపిస్తాయి. ఈ పువ్వులో మాత్రమే కాకుండా దీని చెట్టులో కూడా ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఆయుర్వేదలో ఈ పువ్వు కొమ్మలను ఉపయోగిస్తుంటారు. ఇందులో అధిక శాతం కాల్షియం, కాపర్, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో చర్మాన్నికి కావాల్సిన విటమిన్ సి, బి6, కె కూడా ఉంటాయి. అయితే ప్రతిరోజు మందారం పువ్వుతో తయారు చేసే టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. దీని తాగడం వల్ల చర్మానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
మందార పువ్వు టీ:
ఎండబెట్టిన మందార పువ్వులు
నీరు
తేనె
నిమ్మరసం
తయారీ విధానం:
ఒక కప్పు నీటిని బాగా వేడి చేయండి. కానీ మరిగించకండి. వేడి నీటిలో 2-3 ఎండబెట్టిన మందార పువ్వులను వేసి, కప్పును మూతతో కప్పండి. 5-10 నిమిషాల తర్వాత, టీని వడకట్టి, దానిలో తేనె, నిమ్మరసం కలుపుకోండి. వెచ్చగా ఉన్న టీని ఆస్వాదించండి.
మందార ఫేస్ మాస్క్:
మందారం పూలతో ఫేస మాస్క్ చర్మాన్నికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మాస్క్ కోసం మందార పువ్వులు, తేనె తీసుకొని రెండిటిని కలుపుకోవాలి. ఇలా వారానికి రెండు స్లారు రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
రెండో ఫేస్ మాస్క్:
మందారం పువ్వులను పేస్ట్‌లా చేసుకొని అందులోకి పెరుగు కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు కనిపించకుండా ఉంటాయి.
ఇలా చేయడం వల్ల మందారంలోని యాంటీ ఏజింగ్ గుణాలు చర్మాన్ని రక్షిస్తాయి. సహజ సిద్ధమైన కాంతిని అందిస్తుంది. మీరు కూడా ఈ మందారంతో ఇలా ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని ముఖాన్నికి రాసుకోవడం మంచిదని చర్మనిపుణులు చెబుతున్నారు.
Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook