High Blood Sugar Warning Sign: మధుమేహం చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఎందుకంటే ఈ వ్యాధి బారిన ఒక్కసారి పడితే చనిపోయే దాకా అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పటివరకు మధుమేహానికి ఎలాంటి చికిత్స లేదు. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు వారు రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే అది ప్రాణాంతకంగానూ మరొచ్చు. ప్రస్తుతం చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.? వారికి తెలియకుండా మధుమేహం బారిన పడుతున్నారు. అయితే కొందరిలో డయాబెటిస్‌ లక్షణాలున్నా, మరికొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండా మధుమేహం బారిన పడుతున్నారు. రక్తంలో చక్కెర పరిమాణాలు అతిగా పెరగడం కారణంగా ఈ కింది లక్షణాలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు శరీరం ఈ లక్షణాలు తప్పవు:
మూత్రం వాసన:

మూత్రం నుంచి తరచుగా వాసన వస్తుంటే.. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినట్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మూత్ర పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.


కంటి చూపు కోల్పోవడం:
రక్తంలో చక్కెర పెరిగినప్పుడు దాని ప్రభావం కళ్లపైన కూడా పడుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే స్పష్టమైన వెలుతురు ఉన్నప్పటికీ మీ కంటి చూపు అస్పష్టంగా ఉంటే తప్పకుండా షుగర్‌ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మధుమేహం ఉన్నవారిలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


బరువు తగ్గడం:
మధుమేహం బారిన పడే చాలా మందిలో బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయి. రక్తంలో హెచ్చు తగ్గులకు గురవుతున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అకస్మాత్తుగా బరువు తగ్గితే తప్పకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను స్థాయిలను పరీక్షించుకోవాలి. ఎక్కువ పరిమాణాలుంటే తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Thalapathy 67 Updates : లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సంజయ్ దత్.. విజయ్‌ సినిమా క్యాస్టింగ్ ఇద


Also Read: Sai Pallavi : జీవితంలో అవి ఉంటే చాలట.. నవ్వులు చిందిస్తున్న సాయి పల్లవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook