High Cholesterol Symptoms: జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారినడుతున్నారు. అంతేకాకుండా బయట లభించే ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా మంది ప్రాణాంతక సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అయితే బయట లభించే అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల కొన్ని లక్షణాలు ఉత్పన్నమవుతాయి. చెడు కొవ్వు పెరగడం వల్ల ఎలాంటి లక్షణాలు శరీరంలో ఏర్పడుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్త నాళాలు:
అధిక కొలెస్ట్రాల్ రక్త నాళాల సమస్యలకు కూడా దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో గుండె పోటుకు కూడా దారీ తీసే అవకాశాలున్నాయి. దీని వల్ల హై బీపీ, మధుమేహంతో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.


చెడు కొలెస్ట్రాల్‌ అని ఎలా తెలుసుకోవాలి.?:
వేయించిన ఆహారాన్ని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ప్రమాదం పెరిగే అవకాశాలున్నాయి. మార్కెట్‌లో లభించే చాలా ఆహారాలు ఆయిల్ ఫుడ్, అనారోగ్యకరమైనవి లభిస్తున్నాయి. దీంతో వీటిని తరుచుగా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కు దారీ తిసే అవకాశాలున్నాయి. అయితే అధిక కొలెస్ట్రాల్‌ను గుర్తించడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


గుండె సమస్యలు:
చేతుల్లో తీవ్రమైన నొప్పి కలిగి ఉంటే.. అస్సలు విస్మరించవద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్ కారణంగా.. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయకపోవచ్చు. దీంతో చేతుల్లో నొప్పులు సంభవించే అవకాశాలున్నాయి.


జలదరింపు సమస్య:
చేతుల్లో జలదరింపు సమస్య ఉంటే.. చేతి రక్తనాళాల్లో రక్త సరఫరా తగ్గుతోందని అర్థం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల తీవ్ర నొప్పులు వచ్చే అవకాశాలున్నాయి. చేతిలో నిరంతరం జలదరింపు ఉంటే తప్పకుండా వైద్యులను పంప్రదించడం చాలా మంచిది.


కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మం రంగు మారుతుందా..?:
చేతులకు సరైన రక్త సరఫరా ఉంటే గోళ్ల రంగు లేతగా ఉంటాయి. ముఖ్యంగా శరీరం ఆరోగ్యంగా ఉంటే గోళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటాయి. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే గోర్లు, చర్మం యొక్క రంగు మారడం ప్రారంభమవుతుంది. ఇలా రంగు మారడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.


Also Read: అప్పటి నుంచి ఏమీ లేదు.. ఎవర్ని ఎక్కడ పెట్టాలో ఎన్టీఆర్ కు తెలుసంటున్న డైరెక్టర్!


Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook