High-protein Side Effects: అతిగా హై ప్రోటిన్స్ కలిగి ఆహారాలు తీసుకుంటే అంతే సంగతి..
High-protein Diet Side Effects: హై ప్రోటిన్స్ కలిగిన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల దుష్ర్పభావాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిది.
High-protein Diet Side Effects: ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా వ్యాయామాలు చేయడం కూడా శరీరానికి చాలా అవసరం. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటిన్లు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ తీసుకుంటే శరీరం దృఢంగా తయారు కావడమేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అందుకే చాలా మంది విచ్చల విడిగా ప్రోటిన్లు గల ఆహారాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చాలా మంది ప్రోటిన్లు కలిగిన ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి తీవ్ర దుష్ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయి. అయితే శరీరానికి ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె సమస్యలు రావొచ్చు:
అతిగా ప్రొటీన్లు కలిగిన ఆహారాలు తీసుంటే శరీరం చాలా రకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలున్నాయి. ప్రోటిన్స్ ఎక్కువ కావడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు. కాబట్టి వీటిని అతిగా తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి:
ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం కిడ్నీసమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శరీరంలో ప్రోటిన్ల పరిమాణాలు పెరగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఎముకలు బలహీనంగా మారతాయి:
అధిక ప్రోటీన్స్ గల ఆహారాలు తీసుకోవడం వల్ల ఎముకలపై తీవ్ర ప్రభావం కలిగే అవకాశాలున్నాయి. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లో నొప్పి, బలహీనత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎముకల సమస్యలతో బాధపడుతున్నవారు ప్రోటిన్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Kaala Bhairava: శత్రువులను జయించేందుకు కాలభైరవ పూజ చేయండి.. శనివారం పూజ చేస్తే విజయం మీదే..
Also Read: Team India: ఒకే ఏడాదిలో 8 మంది కెప్టెన్లు.. కేఎల్ రాహుల్ ఫ్లాప్ షో.. సెలక్టర్లు ఇలా చేసినందుకే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook