Homemade Hair Conditioners: స్నానం చేసిన ప్రతి సారీ కండిషనర్ పెట్టుకోవడం వల్ల జుట్టు స్ప్లిట్ ఎండ్ సమస్య ఉండదని అంటారు. అందుకే అందరూ ఉపయోగిస్తారు. కండిషనర్ కొనాలంటే అధిక ఖర్చు ఉంటుంది. అయితే ఇంట్లోనే సహజ సిద్ధంగా చేసుకునే కండిషనర్లు కూడా ఉన్నాయి. మార్కెట్లో కొన్ని కెమికల్స్ అధికంగా ఉండే కండిషనర్లు ఉంటాయి. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూపిస్తాయి. ఇంట్లో ఉన్న వస్తువులతో కండీషనర్‌ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీంతో మీ జుట్టు పొడిబారకుండా, ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హనీ కండిషనర్..
రెండు టేబుల్ స్పూన్ల తేనె ఒక బౌల్ లోకి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలు కూడా  వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీ జుట్టు ఒకవేళ పెద్దగా ఉందనుకోండి దీనికి క్వాంటిటీ పెంచుకోవాలి. ఇది మీడియం సైజు క్వాంటిటీ ఇప్పుడు అందులోనే ఒక స్పూను వెనిగర్ కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి. సాధారణంగా మీరు షాంపూ చేసుకున్న తర్వాత ఇంట్లో తయారు చేసుకునే ఈ హోం మేడ్ కండిషనర్ను కూడా మీ జుట్టు వెంట్రుకలకు అప్లై చేసుకుని కాసేపైన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి దీంతో మీ జుట్టు మృదువుగా షైనీగా మెరుస్తూ ఉంటుంది.


ఇదీ చదవండి: ముఖవర్ఛస్సును పెంచే 8 పండ్లు.. మీ డైట్ లో ఉన్నాయా మరీ..?


యోగార్ట్‌ హెయిర్ కండిషనర్..
ఈ యోగార్ట్‌ హెయిర్ కండిషనర్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది హెయిర్ కండిషనర్ తయారు చేసుకోవడానికి ఒక మూడు టేబుల్ స్పూన్ల యోగార్ట్‌ తీసుకొని అందులోనే ఒక గుడ్డు వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇందులోనే ఒక ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మంచి కండిషనర్ల పని చేస్తుంది. మీ జుట్టుకు షాంపూ చేసుకున్న తర్వాత కండిషన్ చేసుకొని ఆ తర్వాత మీరే చూస్తారు అదిరిపోయే షైనీ హెయిర్.


ఇదీ చదవండి: ఈ 5 ఆయుర్వేద హెయిర్ ఆయిల్ జుట్టును సహజసిద్ధంగా కుదుళ్ల నుంచి బలపరుస్తాయి..


కలబంద కండిషనర్..
కలబంద కండిషనర్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి ఒక నాలుగు స్పూన్ల కలబంద ఒక బౌల్ లోకి తీసుకొని అందులోనే మరో నాలుగు స్పూన్ల  ఆలివ్‌ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మీ జుట్టుకు షాంపూ చేసుకున్న తర్వాత నీళ్లు అన్ని పిండేసి కండిషనర్ మాదిరి అప్లై చేసుకుని ఐదు పది నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు సాధారణ షాంపుతో సాధారణ నీటితో హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది.ఈ సహజ సిద్ధమైన కండిషనర్ తో మన జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది వీటిని మీ హెయిర్ కేర్ లో చేర్చుకోండి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి