Honey Mask For Face: తేనె తీసుకోవడం వల్ల ఆరోగ్యనికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో యాంటీ  ఇన్ష్లమేటరీ లక్షణాలు ఉంటాయి.  దీని వల్ల శరీరానికి మాత్రమే కాకుండా చర్మంకు కూడా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ముఖం అందంగా కనిపించడంలో తేనె ఎంతో సహాయపడుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తేనెను ముఖానికి రాసుకుని మర్ధనా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారువుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.


తేనెలో ఉండే ఔషధ గుణాలు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తేనెను తీసుకుని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మంపై ఉండే మురికి తొలిగి చర్మం శుభ్రంగా మారుతుంది.


జిడ్డు చ‌ర్మం, బ‌య‌ట ఎక్కువ‌గా తిరిగే వారు ముందుగా ముఖానికి  కొబ్బ‌రి నూనె రాసుకుని ముఖానికి ఆవిరి ప‌ట్టుకోవాలి. తర్వాత తెనేను ముఖానికి రాసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.  


తేనెను ఉపయోగించడం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలిగిపోతాయి. తేనెలో ఉండే పోష‌కాలన్నీ కూడా ఇన్ స్టాంట్ గా చ‌ర్మానికి అందుతాయి. దీంతో చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.  


Also Read Cholesterol Reducing Foods: చలికాలంలో కొలెస్ట్రాల్‌ను అంతమొందించే కూరగాయలు ఇవే..


కొంతమందిలో మచ్చల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే తేనెతో చర్మం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. 


తేనె వాడటం వల్ల చర్మం తేమగా ఉంటుంది. దీని వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.


చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో తేనె ఎంతగానో సహాయపడుతుంది.


 తేనె మాయిశ్చరైజింగ్ , పోషణ గుణాలను కలిగి ఉంటుంది. 


 చర్మంపై పచ్చి తేనె పూయడం వలన   సహాయపడుతుంది మొటిమల సమస్యల దరికి రాదు.


అయితే మార్కెట్ లో క‌ల్తీ తేనె ఎక్కువ‌గా ల‌భిస్తుంది. క‌ల్తీ తేనెను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. కాబట్టి స్వ‌చ్చ‌మైన తేనెను వాడిన‌ప్పుడు మ‌నం ఆశించిన ఫ‌లితం ద‌క్కుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.


Also Read  Green Peas: పచ్చి బఠానీలు ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter