How To Apply Lemon On Face: నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. ఇందులో ఉండే గుణాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి నిమ్మరసాన్ని ఆహారంలో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు సమస్యలు ఉన్నచోట్ల నిమ్మరసాన్ని అప్లై చేయడం వల్ల చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో ఉండే మూలకాలు ముఖంపై వచ్చే చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీనికోసం ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ పద్ధతిలో నిమ్మకాయను ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖానికి నిమ్మరసాన్ని ఇలా అప్లై చేయాలి:
తగినంత బియ్యప్పిండిని తీసుకొని అందులో నిమ్మకాయ రసాన్ని వేసి ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసిన మిశ్రమాన్ని దాదాపు 20 నిమిషాల పాటు ఉంచి. శుభ్రమైన నీటితో కడిగేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ ను తీసి ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత శుభ్రమైన గుడ్డతో ముఖాన్ని తుడుచుకుంటే ఫలితం తొందర్లోనే పొందుతారు.


నిమ్మకాయ, చక్కెర:
నిమ్మరసంలో చక్కెరను కలిపి మిశ్రమంలా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేస్తే సులభంగా ముఖంపై మచ్చలు మొటిమల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే మిశ్రమంలో అలోవెరా జెల్ ని వేసి మిక్స్ చేసి ముఖానికి పట్టిస్తే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


నిమ్మ , గ్రీన్ టీ:
నిమ్మకాయ రసంలో గ్రీన్ టీ ని కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా ముఖంపై చర్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా ముఖంపై చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read : RJ Surya and Aarohi : కష్టం, సుఖం పంచుకుంటాం.. సూర్యపై ఆరోహి కామెంట్స్.. బిగ్ బాస్ అనంతరం ఇలా


Also Read : Mahesh Babu Wife : నాలో వేడి పుట్టించండంటోన్న మహేష్‌ బాబు భార్య.. కొత్త లుక్కుతో షాకిచ్చిన నమ్రత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook