How To Get Glowing Skin: బంగాళదుంపలతో చేసిన ఆహారాలను భారతీయులు ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకుంటే శరీర దృఢంగా మారుతుంది. ఇందులో చాలా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి శరీరానికే కాకుండా చర్మానికి మంచి లాభాలను చేకూర్చుతుంది. ముఖ్యంగా పొడి చర్మం సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు, మురికి వదిలించడానికి బంగాళదుంప ప్రధాన పాత్ర పోషిస్తుంది. చర్మ సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌ లభించే ఉత్పత్తులను వినియోగించకుండా.. ఈ సులభమైన చిట్కాలను వినియోగించడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాదుంప రసం, పెరుగు:
బంగాళాదుంప పేస్ట్‌లో పెరుగును చర్మానికి వినియోగిస్తే.. రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ మిశ్రమం చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మంపై నూనెను కూడా పీల్చుకుంటుంది. అయితే ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి.. ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకుని దానికి మూడు చెంచాల బంగాళదుంప రసం కలపండి. చిటికెడు పసుపు కలిపిన తర్వాత బ్రష్‌తో చర్మానికి అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.


అలోవెరా, బంగాళాదుంప:


చర్మం లేదా జుట్టు సంరక్షణ అలోవెరా జెల్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అయితే ఇది చర్మానికి కూడా మంచి ఔషధంలా పని చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ముందుగా బంగాళదుంపను పేస్ట్ తయారు చేసి.. అందులో అలోవెరా జెల్ కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా అలోవెరా జెల్‌ని చేతిలోకి తీసుకుని ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత శుభ్రమైన నీటితో ముఖం కడుక్కోవాలి.


బియ్యం, బంగాళదుంపలు:


చర్మ సంరక్షణలో బియ్యం కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. బియ్యాన్ని ఉడకబెట్టి నీటిలో  బంగాళదుంప రసాన్ని కలిపి కాటన్ సహాయంతో చర్మానికి పట్టించాలి. ఇలా చేసిన తర్వాత  నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook