Reduces Cholesterol: సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగించే అద్భుత ఔషధ మూలకాలు ఇవే.. వీటితో దీర్ఘకాలిక వ్యాధులు సైతం దూరం!
How To Lower Ldl Cholesterol: ప్రస్తుతం చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. అయితే దీని నుండి ఉపశమనం పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్న.. అయినప్పటికీ కొలెస్ట్రాల్ ను కరిగించుకోలేకపోతున్నారు.
How To Lower Ldl Cholesterol: ప్రస్తుతం చాలామందిలో సిరలలోని కొలెస్ట్రాల్ పరిమాణం విచ్చలవిడిగా పెరగడం కారణంగా స్ట్రోక్, గుండెల్లో మంట వంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవడం మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ప్రస్తుతం చాలా మంది కొలెస్ట్రాలను నియంత్రించుకోవడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో తయారుచేసిన ఔషధాలను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు రకాల టీలను ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. వీటి వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేద నిపుణులు సూచించిన తులసితో తయారు చేసిన టీ ని ప్రతిరోజు తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు సులభంగా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు సైతం దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తులసిని నీటిని ప్రతిరోజు తాగడం వల్ల దగ్గు జలుబు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తీవ్ర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న ప్రతిరోజు తులసిని నమిలి తినాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల నోటి నుంచి దుర్వాసన కూడా తొలగిపోతుంది.
Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి
ఆహారాల రుచిని పెంచేందుకు కరివేపాకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే దీని వినియోగించడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను సులభంగా తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపణులు చెబుతున్నారు. ఇందులో ఉండే అన్ని రకాల ఔషధం మూలకాలు శరీరంలోని గుండె సిరల్లో పేరుకుపోయిన తీవ్ర కొలెస్ట్రాలను సులభంగా కరిగిస్తుంది. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవాలనుకునేవారు ప్రతిరోజు కలబంద రసాన్ని వినియోగించడం వల్ల కూడా గొప్ప ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ మూలకాలు తీవ్రదీర్ఘకాలిక వ్యాధులనుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని సంరక్షించేందుకు కూడా సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఊబకాయం సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ రసాన్ని వినియోగించడం వల్ల సులభంగా శరీర బరువు తగ్గొచ్చు.
Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook