How To Make Anti Lice Hair Oil: బిజీ లైఫ్ కారణంగా చాలా మంది జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు. అందుకే చాలా మందిలో జుట్టు మురికిగా మారిపోయి. జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే తరచుగా ఇలా మురికి చేరడం వల్ల తీవ్ర జుట్టు సమస్యలతో పాటు పేన్ల సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలో బాధపడేవారు తప్పకుండా జుట్టు సంరక్షించుకోవడం చాలా మంచిది లేకపోతే బట్టల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడేవారు వివిధ రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల సమస్యలు మరింత తీవ్ర తరమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలకు నిపుణులు సూచించిన ఆయుర్వేద గుణాలు కలిగిన ఈ యాంటీ లైస్ హెయిర్ ఆయిల్ వినియోగించండి. అయితే ఈ ఆయిల్‌ను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాంటీ లైస్ హెయిర్ ఆయిల్‌ తయారీకి అవసరమైన పదార్థాలు:
>>ఆలివ్ నూనె 56.7 గ్రాములు
>>లావెండర్ నూనె
>>కాటన్ బాల్


నూనె తయారీ పద్ధతి?:
యాంటీ పేలు హెయిర్ ఆయిల్ చేయడానికి..ముందుగా ఓ చిన్న బౌల్‌ తీసుకోండి.
ఆ గిన్నలో ఆలివ్ నూనె వేసుకోవాలి, అంతేకాకుండా అందులో లావెండర్ నూనె వేసి బాగా మిక్స్‌ చేయాలి.
ఇప్పుడు పేనులను వదిలించుకోవడానికి యాంటీ లైస్ హెయిర్ ఆయిల్‌ సిద్ధంగా ఉంది.


జుట్టుకు ఎలా అప్లై చేయాలో తెలుసా?:
యాంటీ లైస్ హెయిర్ ఆయిల్ అప్లై చేయడానికి.. ముందుగా కాటన్ బాల్‌ను నూనెలో నానబెట్టండి.
ఆ దూదితో మీ జుట్టుకు నూనెను అప్లై చేయండి.
ముఖ్యంగా ఈ ఆయిల్‌ను పేన్లు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అప్లై చేయాల్సి ఉంటుంది.
ఈ నూనె అప్లై చేసిన తర్వాత తలను దువ్వాల్సి ఉంటుంది.
20నిమిషాలతో షాంపూ సహాయంతో జుట్టును శుభ్రం చేసుకోండి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి


Also read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook