Apple Juice Recipe: యాపిల్‌ లో ఎన్నో రకాల విటమిన్లు,  మినరల్స్‌,  యాంటీఆక్సిడెంట్లుతో నిండి ఉంటుంది.  దీని తీసుకోవడం వల్ల శక్తిను పెంచుతుంది.అలాగే రోగధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీని వేసవిలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుంది. అంతేకాకుండా దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్‌ జ్యూస్‌ లాభాలు:


రోగనిరోధక శక్తిని పెంచుతుంది: 


యాపిల్‌ జ్యూస్‌లో  ఉండే విటమిన్ సి  రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. 


గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:


యాపిల్‌ జ్యూస్‌లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల  ప్రమాదాన్ని  తగ్గిస్తుంది.


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:


యాపిల్‌ జ్యూస్‌లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని  నివారించడానికి  జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.


మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది: 


యాపిల్‌ జ్యూస్‌ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. దీని ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. 


శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది:


శరీర పనితీరుకు హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. యాపిల్ జ్యూస్ దాహాన్ని తీర్చడమే కాకుండా మీ శరీరాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది.


ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:


యాపిల్ జ్యూస్ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ఆస్తమా ఇతర శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:


యాపిల్ జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.


కావలసిన పదార్థాలు:


4-5 ఆపిల్‌లు


నిమ్మరసం - 1 టీస్పూన్


చక్కెర - రుచికి తగినంత 


నీళ్ళు - ⅓ కప్పు


తయారుచేసే పద్ధతి:


ఆపిల్‌లను శుభ్రంగా కడగాలి. ఆ తరువాత ఆపిల్ తొక్కను తీయాలి. ఆపిల్ ముక్కలుగా కోయాలి. నిమ్మరసం వేస్తే రంగు మారకుండా ఉంటుంది.జ్యూసర్  లేదా మిక్సర్ లో వేసి రసం తీయాలి. మిక్సర్ వాడితే కొంచెం నీళ్ళు వేసి మెత్తగా రుబ్బాలి.  తర్వాత ఒక సన్నని జల్లెడ ద్వారా పోసి గుజ్జును తీసేయాలి. 
రుచికి తగినంత చక్కెర వేసి బాగా కలపాలి. చాలా గట్టిగా ఉంటే , కొంచెం నీళ్ళు  వేసికోవాలి. ఒక గ్లాసులో పోసి చల్లగా ఆస్వాదించండి.


మరికొన్ని చిట్కాలు:


పండిన ఆపిల్‌లు వాడితే రసం బాగా వస్తుంది.


ఆకుపచ్చ రంగు ఆపిల్‌లు కొంచెం పుల్లగా ఉంటాయి.


ఈ విధంగా యాపిల్‌ జ్యూస్‌ను తయారు చేసుకోవచ్చు. అలాగే మీరు దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది


Also read: Abortion Pills: ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అయితే మహిళలు జాగ్రత్త..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook