How To Make Avocado Hair Mask: అవకాడో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరానికే కాకుండా జుట్టుకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిని జుట్టుకు వినియోగించడం వల్ల తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అవోకాడోలో విటమిన్ డి అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి జుట్టును అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అవోకాడోలో స్కాల్ప్‌కు లోతైన పోషణ అందిచే మూలకాలు ఉంటాయి. కాబట్టి హెయిర్ మాస్క్‌ను జుట్టుకు వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవకాడో హెయిర్ మాస్క్ చేయడానికి కావలసిన పదార్థాలు:
2-3 అవోకాడో
తేనె 4-5 టేబుల్ స్పూన్లు


అవకాడో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి?
అవకాడో హెయిర్ మాస్క్ చేయడానికి, ముందుగా 2-3 అవకాడోలను తీసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత దాని పొట్టు తీసి, మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
అదే మిశ్రమంలో 4-5 స్పూన్ల తేనెను వేయాలి.
తర్వాత ఈ రెండు పదార్థాలను బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి.
ఇప్పుడు మీ అవకాడో హెయిర్ మాస్క్ సిద్ధంగా ఉంది.


అవకాడో హెయిర్ మాస్క్ ఎలా వినియోగించాలి.?:
అవకాడో హెయిర్ మాస్క్‌ను మీ జుట్టు మూలాలకు అప్లై చేయాల్సి ఉంటుంది.
అప్పుడు మీ జుట్టును సుమారు 10 నిమిషాలు ఆవిరి చేయండి.
ఆ తర్వాత మీరు జుట్టును సుమారు 20 నిమిషాలు గాలికి వదలాలి.
30 నిమిషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!


Also Read: Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook