Beetroot Upma: బ్రేక్‌ఫాస్ట్‌లో బీట్రూట్ ఉప్మా .. ఆరోగ్యానికి ఎంతో మేలు!
Beetroot Upma Recipe: బీట్ రూట్ ఉప్మా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం.
Beetroot Upma Recipe: బీట్ రూట్‌ని ఎంతో ఇష్టంగా చాలా మంది తింటారు . దీని కొందరు జ్యూస్‌గా, ముక్కులగా తీసుకుంటారు. కొంతమంది కూరలలో కూడా ఉపయోగిస్తారు. అయితే బీట్ రూట్‌ని నేరుగా తినలేని వారు ఈ విధంగా ఉప్మా తయారు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఉప్మా అంటే ఇష్టంగా తినేవారు ఈ బీట్ రూట్ ఉప్మాని ట్రై చేయండి. ఎంతో రుచికరమైన ఉప్మాని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు. అయితే దీని కోసం మీరు ఇంట్లో లభించే వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది. అలాగే దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం కూడా.
బీట్ రూట్ ఉప్మాకి కావాల్సిన పదార్ధాలు:
మినప్పప్పు ఒక టీ స్పూన్, జీలకర్ర అరటీస్పూన్, కొత్తిమీర, నిమ్మరసం టీ స్పూన్, ఉప్పు, కర్వేపాకు, రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, అల్లం, నూనె, పల్లీలు, జీడిపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, బీట్ రూట్ తురుము, ఉప్మారవ్వ పావుకిలో
Also Read Kasara Kayalu: పొలం గట్లపై ఉండే ఈ కాసర కాయలను తింటే, శరీరంలో మ్యాజిక్ జరగడం ఖాయం..
బీట్ రూట్ ఉప్మా తయారు విధానం:
ముందుగా పాన్‌లో నూనె వేడి చేసుకోవాలి. తర్వాత శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కర్వేపాకు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, కర్వేపాకు, అల్లంముక్కలు వేయించుకోవాలి. ఆ తర్వాత బీట్ రూట్ తురుము వేసి సిమ్‌లో వేయించుకోవాలి. బీట్ రూట్ తురుము దోరగా వేగిన తరువాత రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. నీరు మరుగుతున్నప్పుడు ముందుగా తీసుకున్న ఉప్మా రవ్వను వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా బీట్ రూట్ ఉప్మా రెడీ.. ఉప్మా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పిల్లలు దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అలానే రక్త తక్కువగా ఉన్నవారు దీని తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది. మీరు కూడా తప్పకుండా ఈ బీట్ రూట్ ఉప్మాను తయారు చేసి తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. దీని బ్రేక్‌ఫాస్ట్‌లాగా తీసుకోవడం ఎంతో మంచిది.
Also Read Ginger Side Effects: అల్లాన్ని వినియోగించే వారికి బ్యాడ్ న్యూస్..ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter