కావలసిన పదార్థాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాప్సికమ్- రెండు


ధనియాలు- ఒకటిన్నర టీస్పూన్లు 


కొబ్బరి తురుము- టేబుల్ స్పూన్


ఎండుమిర్చి- ఒకటి  


నువ్వులు- టీ స్పూన్ 


బుడ్డలు/పల్లీలు/ వేరుశెనగలు- పావు కప్పు


ఉల్లిపాయ- ఒకటి పెద్దది 


వెల్లుల్లి- 2 రెబ్బలు 


కారం- తగినంత 


ఉప్పు- తగినంత 


నూనె- 2 టేబుల్ స్పూన్లు  


పసుపు- పావు తీ స్పూన్ 


నిమ్మరసం- అర టీస్పూన్ 


నీళ్లు- ముప్పావు కప్పు 
  
గార్నిష్ కోసం కొత్తమీర, ఒక రెమ్మ కరివేపాకు సిద్ధం చేసుకోవాలి. 


తయారీ విధానం


* ధనియాలు, కొబ్బరి, ఎండుమిర్చి, నువ్వులు వేయించి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. తరువాత పల్లీలు కూడా వేసి పేస్టులా  గ్రైండ్ చేసుకోవాలి.


* బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర వేయించుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, వెల్లుల్లి రెబ్బలను వేసి వేగనివ్వాలి. ఆ తరువాత క్యాప్సికం ముక్కలను వేసి, ఉప్పు వేసి వేగనివ్వాలి. గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసి కాసేపు ఉడకనివ్వాలి. 


* తరువాత పసుపు, కారం వేసి ఒక నిమిషంపాటు ఉడికించి.. మసాలా పొడి, నిమ్మరసం కలిపి మరో రెండు-మూడు నిమిషాలు ఉడికించాలి.


*చివరగా పావు కప్పు నీళ్లు పోసి ఉడికించి.. పైన కొత్తిమీర, కరివేపాకుతో కాస్త గార్నిష్ చేసుకొని మంటమీద నుంచి దించేయాలి. అంతే చలికాలంలో వేడి వేడి క్యాపికం మసాలా కూర రెడీ..! దీనిని మీరు రొట్టెల్లో, చపాతీల్లో, అన్నంలో తినవచ్చు.