Watermelon Juice Recipe: వేసవి మొదలైంది. ఈ ఎండలకు నీరు ఎక్కువగా తాగాల్సి వస్తుంది. కానీ నీరు తాగడం వల్ల ఉపశమనం పొందిన మరింత దాహంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏదైనా చల్లటి వస్తువు తీసుకోవాలి అనిపిస్తుంది. వేసవిలో ఎక్కువ డిమాండ్‌ ఉండేది కూల్‌ డ్రింక్స్‌. అయితే వీటిలో అధిక శాతం షుగర్‌ ఉండటం వల్ల శరీరానికి ఎంత మంచిది కాదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధిక షుగర్‌ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సులువుగా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అయితే ఈ కూల్‌ డ్రింక్స్‌ బదులుగా మీరు పండ్లతో తయారు చేసే పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఎండులు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు పుచ్చకాయను తీసుకోవడం చాలా మంచిది. దీనిలో వాటర్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటారు. 


అయితే మీరు ఇంట్లోనే సులభంగా ఈ జ్యూస్‌ను తయారు చేసుకోవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. దీని కోసం మీరు ఎలాంటి ఖర్చు చేయాల్సి అవసరం లేదు. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగిస్తే సరిపోతుంది. అయితే దీని పిల్లలు,పెద్దలు తీసుకోవచ్చు. అందరూ ఈ డ్రింక్‌ను ఎంతో ఇష్టంగా తీసుకుంటారు.


కావాల్సిన పదార్థాలు:


పుచ్చకాయ ముక్కలు - 1 కప్పు 


చక్కెర - 2 టేబుల్ స్పూన్లు


నిమ్మరసం - 2 టీస్పూన్లు


పుదీనా ఆకులు - కొన్ని 


ఉప్పు


చాట్ మసాలా - 1 టీస్పూన్ 


ఐస్ క్యూబ్స్ - 2 


తయారుచేసే పద్ధతి:


పుచ్చకాయ ముక్కలను మక్సీ జార్‌లో వేయండి 


నిమ్మరసం, చక్కెర, పుదీనా ఆకులు, ఉప్పు, చాట్ మసాలా వేసి కలపాలి.


నీరు కలుపుతూ మృదువంగా పేస్ట్ చేయండి 


గాజు గ్లాసులో వేసి, ఐస్ ముక్కలతో అలంకరించండి 


చిట్కాలు: 


పుచ్చకాయ ఎంత ఎరుపుగా ఉంటే అంత రుచిగా ఉంటుంది పుచ్చకాయ..


చక్కెరకు బదులుగా తేనె  వాడొచ్చు.


ఈ జ్యూస్‌ను ముందుగా చేసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచవచ్చు. ఈ విధంగా వేసవిలో ఈ డ్రింక్‌ తయారు చేసి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇంట్లోనే సులభంగా దీని తయారు చేసుకోవచ్చు. పైన చెప్పిన విధంగా ఈ డ్రింక్‌ను తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు 


Also read: Abortion Pills: ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అయితే మహిళలు జాగ్రత్త..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook