Home Made Foot Scrubs: ముఖం జుట్టు మాత్రమే కాదు పాదాలు, చేతులను కూడా మృదువుగా ఉంచుకోవాలని చాలామంది ప్రయత్నిస్తారు. అయితే కొన్ని రెమెడీలతో ఈజీగా పాదాలను మెరిపించవచ్చు. ఇది డెడ్ సెల్స్ ని తొలగించి కాళ్లుకు మాయిశ్చర్ ని అందించి అందంగా మారుస్తాయి. ఇలా చేయడం వల్ల కాళ్లు మృదువుగా మారతాయి. పాదాలకు పునరుజ్జీవనం అందించే ఫుట్‌ స్క్రబ్స్ ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తేనే, చక్కెర..
చక్కెర చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఈ రెండిటినీ కలిపి కాళ్లకు అప్లై చేయడం వల్ల కాంతివంతం అవుతుంది. తేనే చక్కెరని సమపాళ్లలో ఉపయోగించి థిక్ పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చర్‌ను అందిస్తుంది. దీన్ని మృదువుగా మీ పాదాలపై రబ్ చేసుకోవాలి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.


ఆలివ్ ఆయిల్, ఉప్పు..
ఉప్పు, ఆలివ్ ఆయిల్ తో బరకగా పేస్ట్ తయారు చేసుకోవాలి. దీంతో మన పాదాలను స్క్రబ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారుతాయి. ఇది చర్మానికి ఎక్స్‌ఫోలియేట్‌ అందిస్తుంది. గోరువెచ్చని నీటితో కాళ్లు వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాళ్లు అందంగా మారిపోతాయి.


కాఫీ, కొబ్బరి నూనె..
 కాఫీ కొబ్బరి నూనెను కూడా థిక్‌ పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. దీని సర్క్యులర్ మోషన్ లో మన పాదాలకు అప్లై చేసుకుంటే పాదాల్లో ఉండే డెడ్స్ స్కిన్ సేల్స్ తొలగిపోతాయి. కొబ్బరి నూనె మంచి హైడ్రేషన్ అందించి మృదువుగా మారుస్తుంది. కాసేపయ్యాక సాధారణ నీటితో ఫూట్ వాష్ చేసుకోవాలి.


ఇదీ చదవండి: స్ప్రౌట్స్‌ ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లో తిన్నారంటే ఈజీగా వెయిట్‌ లాస్‌ అవుతారు.. 


బేకింగ్ సోడా నిమ్మరసం..
బేకింగ్ సోడా,నిమ్మరసం కలిపి కూడా పేస్ట్ మాదిరి తయారుచేసుకొని పాదాలకు స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. దీన్ని మృదువుగా పాదాలకు మసాజ్ చేస్తే మంచి ఎక్స్‌ఫోలియేటింగ్‌ గుణాలు ఇస్తుంది. అంతే కాదు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. కాసేపైన తర్వాత గోరువెచ్చని నీటితో కాళ్లనీ శుభ్రం చేసుకోవాలి.


ఎప్సం సాల్ట్ పెపర్మెంటు స్క్రబ్..
ఎప్సమ్ సాల్ట్ లో కొన్ని చుక్కల పెపర్మెంటు ఆయిల్ వేసి స్క్రబ్ తయారు చేసుకోవచ్చు దీంతో మృదువుగా మసాజ్ చేసుకోవాలి దీంతో అలోవెరా లావెండర్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు సమ్ సాల్టు కాళ్లకు మంచి ఎక్స్‌ఫోలియేట్‌ ఇచ్చి మృదువుగా మారుస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )


ఇదీ చదవండి: బియ్యం పిండి ఇలా వాడితే బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి