Lemon Rice Recipe: లెమన్ రైస్ చాలా దక్షిణ భారతీయ ఇళ్లలో ప్రధానమైనది. ఆవాలు, శనగ పప్పు, పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలు, తాజా అల్లం, కరివేపాకులను టెంపరింగ్‌తో ముందుగా ఉడికించిన  బియ్యం కలపడం ద్వారా దీనిని తయారు చేస్తారు. ఇది చాలా మందికి సౌకర్యవంతమైన ఆహారం, సాధారణంగా భోజనం కోసం తింటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీని పండుగలలో, సాధారణంగా తయారు చేసుకొనే వంట. దీని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. మీరు ఎప్పుడైన దీని కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. 


లెమన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు:


2 కప్పులు - బియ్యం 
1 - నిమ్మకాయ
1/4 కప్పు - పల్లీలు 
2 టేబుల్ స్పూన్లు - నూనె 
1/2 టీస్పూన్ - జీలకర్ర 
1/4 టీస్పూన్ - మెంతులు 
1 - ఎండు మిర్చి
కొన్ని - కరివేపాకు 
1/2 టీస్పూన్ - పసుపు 
1/2 టీస్పూన్ - మామిడిపండు పొడి 
1/4 టీస్పూన్ - ముంత 
రుచికి తగినంత - ఉప్పు


లెమన్ రైస్ తయారీ విధానం:


ముందుగా మూడు సార్లు బియ్యంను శుభ్రం చేసుకోవాలి. తర్వాత, బియ్యం నుంచి నీటిని బాగా సేరుకోండి. ఈ బియ్యంను వండుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తరువాత నిమ్మకాయ నుంచి రసం పిండి, చిన్న బాటిలో వేసి పక్కన పెట్టుకోండి. పాన్ లో నూనె వేసి కాగు బెట్టండి. నూనె కాగానే, పల్లీలు వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.వేయించిన పల్లీలు బయటకు తీసుకోవాలి. బాణలిలో ఉన్న నూనెలో జీలకర్ర, మెంతులు వేసి చిటపట లాడించండి.ఆ తర్వాత, ఎండు, కరివేపాకు వేసి కొన్ని సెకన్లు వేయించండి. పసుపు,  మామిడిపండు  పొడి వేయండి. కరివేపాకు రంగు మారిన తర్వాత, పసుపు, ఉప్పు వేసుకోవాలి.  ఈ పేస్‌ను ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకోవాలి. ఈ విధంగా లెమన్‌ రైస్‌ రెడీ అవుతుంది. 


Also read: BP Warnings and Signs: రాత్రి వేళ నిద్రించేటప్పుడు బీపీ పెరిగితే ప్రాణాలు పోతాయా, ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook