Mangalore Chicken Ghee Roast: మంగళూరు స్టైల్ చికెన్ ఘీ రోస్ట్ రిసిపీ.. చూస్తేనే నోరూరిపోతుంది..
Mangalore Chicken Ghee Roast Recipe: ఆదివారం వచ్చిందంటే చికెన్‌తో రిసిపీలు తయారు చేసుకుంటాం. దీంతో ఏ రిసిపీ తయారు చేసినా రుచికరంగా ఉంటుంది. ఇది ఎరుపు రంగులో ఘుమఘుమలాడే నెయ్యితో ఎంతో రుచికరంగా చూస్తూనే నోట్లో నీళ్లు ఊరిపోయేలా ఉంటుంది.
Mangalore Chicken Ghee Roast Recipe: చికెన్‌తో ఎన్నో రిసిపీలు తయారు చేసుకుంటాం. దీంతో ఏ రిసిపీ తయారు చేసినా రుచికరంగా ఉంటుంది. ఇది ఎరుపు రంగులో ఘుమఘుమలాడే నెయ్యితో ఎంతో రుచికరంగా చూస్తూనే నోట్లో నీళ్లు ఊరిపోయేలా ఉంటుంది. ఈ రిసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
చికెన్ ఘీ రోస్ట్‌కు కావాల్సిన పదార్థాలు..
బోన్‌లెస్ చికెన్ -250 గ్రాములు
పెరుగు-3 tbsp
పసుపు- 1/2 tbsp
నిమ్మరసం -1 tbsp
కరివేపాకు
బెల్లం-1 tbsp
నెయ్యి- 3tbsp
ఉప్పు- రుచికి సరిపడా
మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి-6
తోకమిరియాలు-1 tbsp
లవంగాలు-2
ధనియాలు -1 tbsp
జిలకర్ర- 1 tbsp
వెల్లుల్లి రెబ్బలు- 4
చింతపండు పేస్ట్ - 1 tbsp
ఇదీ చదవండి: నోరూరించే రొయ్యల కూర ఇలా వండుకుంటే నోట్లో కరిగిపోతుంది అంతే..
మంగళూరు చికెన్ ఘీ రోస్ట్ తయారీ విధానం..
చికెన్ శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఓ బౌల్ వేసి పెరుగు, పసుపు, నిమ్మరసం బాగా కలపాలి. దీన్ని ఓ గంటపాటు ఫ్రిడ్జ్‌ల్ పెట్టాలి.
ఇప్పుడు ఓ ప్యాన్ తీసుకుని అందులో ఎండు మిర్చి, జిలకర్ర, ధనియాలు, లవంగాల, మిరియాలు మీడియం మంటపై మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి.
ఆ తర్వాత వీటిని ఓ మిక్సర్ జార్‌లోకి తీసుకుని అందులో వెల్లుల్లి చింతపండు పేస్ట్ కూడా వేసి ఓ స్పూన్ నీరు పోసుకుని చిక్కని పేస్ట్ తయారు చేసుకవాలి.
ఒక కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. కరివేపాకు వేసి చిటపటలాడించాలి. ఇప్పుడు మంటను తగ్గించి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి పైకి నూనె తేలే వరకు వేయించుకోవాలి.
ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..
ఇప్పుడు ఇందులోనే ఘీ రోస్ట్ మసాలా కూడా వేసి నెయ్యి సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. చివరగా ఈ కూరలో బెల్లం తురము, ఉప్పు వేసి కరిగే వరకు ఉడికించుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter