COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

How To Make Palak Roti In Telugu: వారంలో ఒక్కరోజైనా పాలకూరను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అధికంగా లభిస్తాయి. ముఖ్యంగా పాలకూరలో విటమిన్లు, ఖనిజాలతో పాటు ఫైబర్‌ కూడా లభిస్తుంది. ఇందులో ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా లభిస్తుంది. దీంతో పాటు ఈ ఆకు కూరలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను నష్టాన్ని తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా బాడీని దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే పిల్లలకు ఈ పాల కూరతో తయారు చేసిన రోటీలను ప్రతి రోజు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రోటీలను తీసుకోవడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటారు. అయితే ఈ పాలకూర రోటీలను ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


కావలసిన పదార్థాలు:
2 కప్పుల పాలకూర(తురిమిన)
1 కప్పు గోధుమ పిండి
1/2 కప్పు బేసన్
1/2 అంగుళం అల్లం(తురిమిన)
2 పచ్చి మిరపకాయలు(తురిమిన)
1/2 టీస్పూన్ జీలకర్ర
1/2 టీస్పూన్ మెంతులు
1/4 టీస్పూన్ పసుపు
1/4 టీస్పూన్ కారం
ఉప్పు రుచికి సరిపడా
నూనె వేయడానికి


తయారీ విధానం:
ముందుగా ఈ పాలకూర రోటీలను తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 
ఒక బౌల్‌లో పాలకూర, గోధుమ పిండి, బేసన్, అల్లం, పచ్చి మిరపకాయలు, జీలకర్ర, మెంతులు, పసుపు, కారంతో పాటు ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇలా మిక్స్‌ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా నీరు కలుపుతూ, మృదువైన పిండిగా కలుపుకోవాల్సి ఉంటుంది.
ఈ పిండిని 10 నుంచి 12 చిన్న ఉండలుగా చేసుకోవాలి. 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత పిండి మిశ్రమాన్ని రోటీలుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
స్టౌవ్‌పై పెనం పెట్టుకుని రోటీలను దానిపై వేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా రోటీలను రెండు వైపులా బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. అంతే సులభంగా రెడీ అయినట్లే..


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


చిట్కాలు:
పాలకూర రోటీలు మరింత రుచిగా రావాలంటే, ముందుగా పాల కూరను కర్రీల తయారు చేసుకుని స్టఫింగ్‌ చేసుకోవచ్చు.
రోటీలకు మరింత రుచిని రావడానికి కొత్తిమీర, పుదీనా లేదా కరివేపాకు వంటి తాజా ఆకు కూరలను కూడా వేసుకోవచ్చు.
రోటీలను మరింత క్రిస్పీగా చేయాలనుకుంటే, వాటిని నూనెలో డీప్ ఫ్రై చేయవచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి