Anjeer Laddu Recipe: అంజీర్ పండ్లు నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటారు. అంతేకాదు ఈ అంజీర్ పండ్లను వేయించి గోల్డెన్ రంగులోకి వచ్చాక నెయ్యి వేసి దీంతో లడ్డూలు తయారు చేస్తే ఇలా సులభంగా నోట్లో కరిగిపోతాయి. బెల్లం, తేనె వేసి తయారు చేసుకుంటాం. కాబట్టి ఇందులో అనే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావలసిన పదార్థాలు
అంజీర్ పండ్లు- ఒక కప్పు
ఖర్జూరం -అరకప్పు
గింజలు -అర కప్పు
తురిమిన కొబ్బరి -పావు కప్పు
నెయ్యి - 2 TBSP
యాలకుల పొడి -1/2 స్పూను 
తేనె -2టేబుల్ స్పూన్లు


ఇదీ చదవండి: తెల్ల వెంట్రుకలను శాశ్వతంగా నల్లగా మార్చే పెప్పర్ హెయిర్ డై ఇలా సింపుల్ గా చేసుకోండి..


అంజీర్ లడ్డు తయారీ విధానం..
ముందుగా అంజీర్ పండ్లను ఒక 20 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టాలి అలాగే ఖర్జూరాలు కూడా నానబెట్టుకోవాలి ఆ తర్వాత నీళ్లు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే బాదం జీడిపప్పు వాల్నట్స్ ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి పాన్ పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి లైటుగా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి.


ఇందులో  కొబ్బరి పొడి వేసుకొని మరో నాలుగు నిమిషాల పాటు నెయ్యిలో ఈ మిక్సీలో మిక్సర్ లో వేయించుకోవాలి.ఇందులోనే యాలకుల పొడి కూడా వేసుకోవాలి. తేనే లేకపోతే బెల్లం కూడా వేసుకొని బాగా కలపాలి. ఈ మిక్సర్ చల్లగా అయిన తర్వాత చేతితో లడ్డూల మాదిరి రెడీ చేసుకోవాలి.చేతిలోకి నెయ్యి తీసుకొని లడ్డూల మాదిరి బాల్స్ కట్టాలి. అంతేకాదు ఈ లడ్డులో కూడా నెయ్యి అప్లై చేయాలి ఆ తర్వాత చల్లారనివ్వాలి వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి ఇది మంచి హెల్తీ స్నాక్.


ఇదీ చదవండి: మీ ఫ్రెండ్స్ తో ఒక్కసారైనా రోడ్ ట్రిప్ వెళ్లాల్సిన టాప్ 7 రోడ్డు మార్గాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.