Paneer Tikka: పన్నీర్ టిక్కాను ఇలా రుచికరంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు..
Paneer Tikka Recipe: పన్నీర్ తో రుచికరమైన వంటకాలు తయారు చేసుకుంటాం. అలాగే టిక్కా కూడా పన్నీర్ తో తయారు చేసుకోవచ్చు. దీన్ని గ్రిల్ చేసి ,బేక్ చేసి తయారు చేయాలి. సింపుల్గా ఇంట్లోనే పన్నీర్ టిక్కాను ఎలా తయారు చేసుకోవాలో ఆ రెసిపీ తెలుసుకుందాం..
Paneer Tikka Recipe: పన్నీర్ తో ఎన్నో రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. పన్నీర్ తో రుచికరమైన టిక్కా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఇది కాటేజ్ చీజ్ తో తయారు చేస్తారు. దీన్ని గ్రిల్ చేసి ,బేక్ చేసి తయారు చేయాలి. సింపుల్గా ఇంట్లోనే పన్నీర్ టిక్కాను ఎలా తయారు చేసుకోవాలో ఆ రెసిపీ తెలుసుకుందాం.
పన్నీర్ టిక్కాకు కావలసిన పదార్థాలు..
పన్నీరు -పావు కిలో
పెరుగు -ఒక కప్పు
నిమ్మరసం -రెండు టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు -ఒక టేబుల్ స్పూన్
కారంపొడి -ఒక టేబుల్ స్పూన్
పసుపు -అర టేబుల్ స్పూన్
గరం మసాలా -ఒక టేబుల్ స్పూన్
ధనియాల పొడి -అర టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి -అర టేబుల్ స్పూన్
చాట్ మసాలా -ఒక టేబుల్ స్పూన్
కసూరీ మేతి -ఒక టేబుల్ స్పూన్
ఉప్పు -రుచికి సరిపడా
నూనె -రెండు టేబుల్ స్పూన్లు
బెల్ పెప్పర్స్ -రెండు
ఉల్లిగడ్డ -ఒకటి
ఉడెన్ స్క్యూ -30 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాలి.
ఇదీ చదవండి: పెరుగుతున్న దోమలు.. మీ పిల్లల్ని 6 విధాలుగా రక్షించుకోండి..
పన్నీర్ టిక్కా తయారీ విధానం..
ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో పెరుగు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, కారంపొడి, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి చాట్ మసాలా, కసూరి మేతి, ఉప్పు, నూనె వేసి బాగా పేస్ట్ మాదిరి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు కూడా వేసి మ్యారినేట్ చేయాలి. పన్నీర్ ముక్కలు అంతటికి ఈ పేస్టు పట్టిన తర్వాత కనీసం ఒక గంట పాటు రిఫ్రిజిరేట్ చేయాలి. లేకపోతే నైట్ అంతా రిఫ్రిజిరేస్ కూడా చేయవచ్చు.
ఇదీ చదవండి: జుట్టు ఆరోగ్యంగా పెంచే 5 సహజ సిద్ధమైన వంటింటి వస్తువులు ఇవే..
ఈ రెసిపీలో మీరు బెల్ పేపర్స్ ఉల్లిపాయలను కట్ చేసి కాసేపు నూనెలో టాస్ చేయాలి దీనికి ఉప్పు మిరియాల పొడి నూనె వేయాలి.మ్యారినేట్ చేసిన పనీర్ ముక్కలను ఉడెన్ స్క్యూవర్ కు గుచ్చాలి. దీనికి బెల్ పేపర్స్, ఉల్లిపాయలు పన్నీరు ఇలా ఆల్టర్నేటివ్గా పెట్టాలి. 200C మీడియం హిట్ లో ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలి . దీనికి ముందుగానే ప్రీ హీట్ చేసుకోవాలి మూడు నిమిషాల పాటు అన్ని రెండు వైపులా ఈ పన్నీర్ టిక్కాను కాల్చుకోవాలి. ఒక బేకింగ్ షీట్ లో ఉడెన్ స్క్యూవర్ కు ఫాయిల్ చుట్టి 20 నిమిషాలు పాటు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు బాగా ఉడుకుతాయి ఈ పన్నీర్ టిక్కాను గ్రీన్ చట్నీతో ఆస్వాదిస్తే రుచికరంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter