Raw turmeric and Garlic chutney: ఈరోజుల్లో కొలెస్ట్రాల్ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. వెల్లుల్లి పసుపుతో కూడా మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఉసిరి చట్నీతో కూడా  కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి మన జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కేవలం వెల్లుల్లి పచ్చి పసుపుతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన మెడిసిన్స్ తరతరాలుగా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లితో కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా సులభంగా తగ్గిపోతాయి. ఇందులో అల్లిసిన్ ఉంటుంది. ఇది శరీరం నుంచి చెడు కొలెస్ట్రాలన్నీ తగ్గించేసి మంచి కొలెస్ట్రాల స్థాయిలను పెంచుతాయి . యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. ఇది గుండె సమస్యలు రాకుండా ప్రాణాంతక సమస్యల నుంచి కాపాడుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పసుపు లాభాలు..
పసుపు రంగు పచ్చ కలర్లో అందంగా కనిపిస్తుంది. ఇది ప్రతి వంటగదిలో ఉండాల్సిందే పసుపులో కూడా ఎన్నో యాంటీ ఆక్సిడెంటు గుణాలు ఉంటాయి. ఇందులో కర్కుమీన్ ఉంటుంది పసుపులో ఇన్ఫ్లమేటరీ అంటే ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కర్కుమీన్ మన శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించేస్తాయి. ఇన్ల్ఫమేషన్ సమస్యను కూడా రాకుండా చేస్తుంది. మన గుండే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి పసుపు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. మంచి జీర్ణ ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. 


ఆమ్లా  ఆరోగ్య ప్రయోజనాలు..
ఉసిరికాయ ఇండియన్ గూస్బెర్రీ ఇందులో ఎన్నో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్ సి అంటే ఆక్సిడెంట్స్ ఉంటాయి దాని తరతరాలుగా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారు ఇందులో ఎన్నో మెడిసినల్ గుణాలు ఉంటాయి. కార్డియా వాస్కుల సమస్యలు రాకుండా కొలెస్ట్రాల్ ఇవ్వాల్సిన తగ్గిస్తుంది. ఉసిరిలో పాలిఫైనల్స్ ఉంటాయి. ఇది ఆక్సిడెంట్ నుంచి రిలీవ్ ఇస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది. అంతేకాదు ఆమ్లాలో అండ్ ఇన్ఫర్మేషన్ గుణాలు ఉంటాయి ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.


ఇదీ చదవండి: బరువు తగ్గాలని చాలా కఠిన ప్రయత్నాలు చేస్తున్నారా? మజ్జిగలో ఈ ఒక్కవస్తువు కలిపి తాగి చూడండి..


వెల్లుల్లి, పసుపు చట్నీ తయారు చేసే విధానం..
కావలసిన పదార్థాలు..
వెల్లుల్లి రెబ్బలు- 12
పచ్చి పసుపు -ఒక ఇంచు
 ఉసిరి -2
నిమ్మకాయ రసం- ఒక టేబుల్ స్పూన్ 
తేనె- ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు రుచికి సరిపడా


ఇదీ చదవండి: రెస్టారెంట్ స్టైల్‌లో కాకరకాయ వేపుడుని ఇలా తయారు చేసుకోండి..  లొట్టలు వేసుకొని తింటారు


వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి దీన్ని ఒక బౌల్లో వేసుకొని పచ్చి పసుపును కూడా దంచుకొని ఉసిరిని కూడా దంచి వేసుకోవాలి ఇందులో నిమ్మరసం పిండుకొని ఉప్పు కూడా రుచి చూసుకొని వేసుకోవాలి. తీయదనం కావాలంటే ఇందులో తేనె యాడ్ చేసుకోవాలి.  ఈ పదార్థాలు అన్నిటిని బాగా కలుపుకోవాలి దీన్ని ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే అంతే గార్లిక్ చట్నీ రెడీ అవుతుంది. మీరు తినే ఆహార పదార్థాల్లో ఈ చట్నీని రోజు ఒక స్పూన్ వేసుకుని తినండి ఇది శరీరం నుంచి చెడు కొలెస్ట్రాన్ని తగ్గించి గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. కావాలంటే ఇది సాండ్విచ్ సలాడ్స్ లో కూడా ఉపయోగించవచ్చు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter