Gongura Chicken Recipe: చికెన్‌ తో తయారు చేసుకునే వంటలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో రకాలు ఉంటాయి. చికెన్‌ తో ఎన్ని రిసిపీలు తయారు చేసినా దాని అద్బుతమైన రుచికి అందరూ ఫిదా అవుతారు. చికెన్‌ తో బిర్యానీ, కర్రీ, ఫ్రై, కబాబ్స్ వంటి రకరకాల రిసిపీలు తయారు చేసుకుంటారు. ఇక ఇందులో గొంగూర వేసుకుని పుల్లపుల్లగా గోంగూర చికెన్ తయారు చేసుకుంటే రుచి అదిరిపోతుంది. చికెన్‌ గోంగురతో తయారు చేస్తే లొట్టలేసుకుని తినేవారు బోలేడు మంది ఉన్నారు. సాధారణంగా గోంగూర చట్నీ తింటేనే అదిరిపోద్ది అలాంటిది రుచికరమైన చికెన్‌ రిసిపీని గోంగూర వేసి తయారు చేస్తే మీ వీధి మొత్తం ఘుమఘమలాడి పోవాల్సిందంటే నమ్మండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోంగూర చికెన్‌ కావాల్సిన పదార్థాలు..
గోంగూర -100 గ్రాములు
చికెన్ -1/2 kg
ఆయిల్ -2 tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్‌-2 tbsp
పచ్చిమిర్చి-3
కారంపొడి-1 tbsp
ధనియాల పొడి - 1tbsp
జిలకర్ర- 1tbsp
పసుపు- 1/4 tbsp
కొత్తిమీర కట్ట-2
ఉప్పు- రుచికి సరిపడా


గోంగూర చికెన్ తయారీ విధానం..
గోంగూర తీసుకుని కాడల నుంచి ఆకులను సపరేట్‌ చేయాలి. వీటిని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత స్టవ్‌ ఆన్‌ చేసి ఓ ప్యాన్‌ పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. గోంగూర ఆకులు వేసి వేయించుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసి ఓ 8 నిమిషాలపాటు మీడియం మంటపై ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీన్ని మెత్తని పేస్ట్‌ మాదిరి తయారు చేసుకోవాలి.


ఇదీ చదవండి: రోజూరాత్రి పడుకునేముందు ఈ ఒక్క ఆయిల్‌తో మీ ముఖం మసాజ్ చేయండి.. హిరోయిన్ వంటి అందం మీదే..


ఇప్పుడు మరో ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్‌ వేసుకుని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్‌ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో మీకు కావాలంటే యాలకులు, లవంగాలు కూడా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, చికెన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులో ఉప్పు కూడా వేసి నీరు ఆవిరయ్యే వరకు ఓ పది నిమిషాలపాటు మీడియం మంటపై ఉడికించుకోవాలి. 


ఇదీ చదవండి: పాలను ఇలా వాడితే మీ ముఖం మిలమిలా మెరిసిపోతుంది..


ఆ తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి ముక్క మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఓ 15 నిమిషాల వరకు ఉడికించాలి. ఇందులో జిలకర్ర, ధనియాల పొడి, పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసి ఉప్పు రుచి చూసుకోవాలి. ఓ ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి. రుచికరమైన వేడివేడి గోంగూర చికెన్ రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా.. అనాల్సిందే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter