Reduce Bloating: జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నారా.. వీటితో 5 నిమిషాల్లో మటు మాయం..
How To Reduce Bloating: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ ఇందులో చాలా మంది పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వే నిపుణులు సూచించి ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
How To Reduce Bloating: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉండాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవన శైలిలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం జీర్ణ క్రియ సమస్యలు ఆయిల్, జంక్ ఫుడ్స్ తిన్నప్పుడు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీటి వల్ల చాలా మంది కడుపు ఉబ్బరానికి కూడా గురవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ కింది ఆహారాలను ప్రతి రోజూ తినాల్సి ఉంటుంది.
అపానవాయువు వదిలించుకోవటం ఎలా:
1. పెరుగు తినండి:
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో జీర్ణక్రియ లక్షణాలు, మంచి బ్యాక్టీరియా ఉంటాయి. కాబట్టి దీనిని ఆహారాల్లో తినడం వల్ల పొట్ట సమస్యలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా పెరుగులో జీలకర్రను వేసి తీసుకుంటే సులభంగా అపానవాయువు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. అల్లం:
గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అల్లం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు పొట్టలోని సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి. కాబట్టి గ్యాస్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ అల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అల్లం కోసి ఒక గ్లాసు నీళ్లతో మరిగించి ఆ నీటిని వడపోసి తాగితే పొట్ట క్లియర్ అవుతుంది.
3. బొప్పాయి తినండి:
బొప్పాయి పండు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను చేకూర్చుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా పొట్టను క్లీన్ చేసేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
4. సోంపు వాటర్:
సోంపు వాటర్‌ను అందరూ మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. అయితే దీనిని ప్రతి రోజూ వినియోగించడం వల్ల పొట్టకు చాలా రకాలుగా సహాయపడుతుంది. అంతేకాకుండా దివ్యౌషధంగా కూడా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు సోంపును ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఆ నీటిని 3 గంటల తర్వాత తాగాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Ponniyin Selvan 2 Release Date : పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
Also Read : Ponniyin Selvan 2 Release Date : పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి