How To Stop Hair Fall: పెరుగుతో కూడా జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు..ఇలా ఓ సారి ట్రై చేయండి!
How To Stop Hair Fall: జుట్టు రాలడం సమస్యలతో బాధపడుతున్న వారు మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ఔషధాలు వినియోగించినక్కర్లేదు.. ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ రెమెడీని వారానికి రెండుసార్లు వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
How To Stop Hair Loss And Regrow Hair Naturally: జుట్టు రాలడం ప్రస్తుతం యువతలో పెద్ద సమస్యగా మారింది. చాలామంది యువతలో వివిధ కారణాలవల్ల జుట్టు రాలిపోతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. లేకపోతే జుట్టు పూర్తిగా రాలిపోయి బట్టతల వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జుట్టు రాలడం తగ్గించుకోవడానికి చాలామంది ఖరీదైన హెయిర్ ట్రీట్మెంట్లను చేయించుకుంటున్నారు. ఇలా చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే తరచుగా జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్న వారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని ఆపి, జుట్టును కుదుళ్ల నుంచి దృఢంగా చేస్తాయి.
తరచుగా మనం పెరుగును ఆహారాల్లో వినియోగిస్తూ ఉంటాము. అయితే జుట్టు రాలడం సమస్యలతో బాధపడుతున్న వారు జుట్టుకు పెరుగును కూడా వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ పెరుగును జుట్టుకు ఎలా వినియోగించాలో? ఎప్పుడు ఎప్పుడు అప్లై చేయాలో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా
ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ముందుగా రెండు టీ స్పూన్ల కలోంజీ విత్తనాలను దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక కప్పులో తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆముదం నూనెను వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే సగం కప్పు పెరుగును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మరోసారి బాగా కలిపి జుట్టుకు అప్లై చేసుకోవాలి.
జుట్టుకు అప్లై చేసుకునే విధానం:
ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకునే ముందు తప్పకుండా జుట్టుని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకున్న జుట్టును తడి ఆరనిచ్చి తయారు చేసుకున్న మిశ్రమాన్ని కుదుళ్ల లోపలిదాకా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు ఆరనిచ్చి..మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత కాటన్ తుపాలతో జుట్టును బాగా తుడవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు దృఢంగా రాలిపోకుండా తయారవుతుంది. తరచుగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని వినియోగించండి.
Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook